Virat Kohli: టీమ్ ఇండియా తాజా మాజీ సారధి విరాట్ కోహ్లి. కెప్టెన్సీ లేకపోయినా..అతడి కెప్టెన్సీపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. అదే అతడి ప్రత్యేకత. ఆ మాజీ క్రికెటర్ అందుకే విరాట్‌పై ప్రశంసలు కురిపించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియా ఆల్ ఫార్మట్ క్రికెట్ కెప్టెన్సీ ఇటీవల తప్పుకున్న విరాట్ కోహ్లీ గురించి ప్రతిరోజూ ఏదో ఒక సందర్భంలో చర్చ జరుగుతూనే ఉంటోంది. ముఖ్యంగా అతడి క్రికెట్ గురించి ఈ చర్చ కొనసాగుతూనే ఉంటోంది. అదే విరాట్ కోహ్లి ప్రత్యేకత. ఇప్పుడు మరోసారి ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఇయాన్ ఛాపెల్..విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. టీమ్ ఇండియాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన అసాధారణ కెప్టెన్ అని విరాట్ కోహ్లీని కొనియాడాడు. అదే సమయంలో ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్ మాత్రం బలహీన కెప్టెన్ అని అభివర్ణించాడు. 


ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, టీమ్ ఇండియా(Team India)మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మద్య వ్యత్యాసాన్ని ఇయాన్ చాపెల్ (Ian Chappell) వివరించాడు. వైస్ కెప్టెన్ అజింక్యా రహానే రూపంలో మంచి సహచరుడి సహాయంతో టీమ్ ఇండియాను విజయపథంలో నడిపించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అని చాపెల్ ప్రశంసించాడు. అదే సమయంలో జో రూట్ ఎక్కువ మ్యాచ్‌లకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించినా..వైఫల్యం చెందాడని వివరించాడు. ఇద్దరు సక్సెస్ కెప్టెన్స్ సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీల వారసత్వాన్ని విరాట్ కోహ్లీ ముందుకు తీసుకెళ్లగలిగాడని ఇయాన్ చాపెల్ స్పష్టం చేశాడు. కేవలం ఏడేళ్లలోనే టీమ్ ఇండియాను విజయ శిఖరాలవైపుకు తీసుకెళ్లాడని చెప్పాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) నిజంగానే ఓ మంచి కెప్టెన్ అని ఇప్పటికే చాలామంది క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. జట్టులో స్ఫూర్తి నింపడం, జట్టు కోసం ఆడటమనేది విరాట్ కోహ్లీ ప్రత్యేకత అనేది ఇప్పటికీ క్రికెట్ ప్రేమికుల వాదన.


Also read: U19 World Cup 2022: బంగ్లాదేశ్‌ను చిత్తుచేసి.. ప్రపంచకప్‌ సెమీస్‌కు చేరిన టీమిండియా!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook