Umran malik: ఐపీఎల్ 2022లో విశ్వరూపం ప్రదర్శించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాడు. మరో ప్రపంచ దిగ్గజ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌పై ప్రశంసలు కురిపించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2021 మధ్యలో ఎంట్రీ ఇచ్చి..సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు ప్రధాన బౌలర్‌గా మారిన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్. నెట్ బౌలర్ నుంచి మెయిన్ పేసర్‌గా ఎదగడమంటే సాధారణ విషయం కాదు. ఐపీఎల్ 2022లో సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన బంతిని విసిరి రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు గెల్చుకున్నాడు. ఈ సీజన్‌లో ఉమ్రాన్ విసిరిన బాల్ వేగం గంటకు 157.8 కిలోమీటర్లు. మొత్తం 14 మ్యాచ్‌లలో 22 వికెట్లు తీశాడు. లీగ్ దశలో అయితే గుజరాత్ టైటాన్స్‌పై 5/25 నమోదు చేశాడు.


ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ అంటే ఇప్పటికే చాలామంది మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. కామెంట్లు చేస్తున్నారు. టీమ్ ఇండియాలో ఎంట్రీ ఇస్తాడని భావించినట్టే..దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఇప్పుడు మరో విదేశీ క్రికెటర్ ఉమ్రాన్ మాలిక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


బ్రెట్ లీ ఏమన్నాడు


ఉమ్రాన్ మాలిక్‌కు నేను మంచి అభిమానిని. అతని బౌలింగ్ స్పీడ్ ప్రత్యర్ధిని తగలెట్టేస్తుంది. ఫాస్ట్ బౌలర్‌లో ఉండే అన్ని లక్షణాలు ఉమ్రాన్ మాలిక్‌లో స్పష్టంగా ఉన్నాయి. కచ్చితమైన వేగంతో పాటు బులెట్ వేగంతో విసిరే బంతులు..నాకైతే..పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనుస్ గుర్తొస్తున్నాడు. అతను కూడా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ..వికెట్లు తీసేవాడు. ఇప్పుడు ఉమ్రాన్ మాలిక్ అదే చేస్తున్నాడు. ఏదో ఒకరోజు ఉమ్రాన్ మాలిక్ ఆ స్థాయికి చేరుకుంటాడు.


Also read: Qinwen Zheng: ఫ్రెంచ్ ఓపెన్‌ ప్రీక్వార్టర్స్‌లో ఓటమిపై చైనా ప్లేయర్ హార్ట్ టచింగ్ కామెంట్స్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook