Rafael Nadal Wife Photos: ప్రపంచ టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా స్పెయిన్ కు చెందిన రఫెల్ నాదల్ నిలిచాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ లో మెద్వెదెవ్ ను ఓడించి.. 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నాదల్ నిలవడం విశేషం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రోఫీ ముద్దాడే సమయంలో తన భార్య మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లో భావోద్వేగానికి గురైంది. ఆట జరుగుతున్న సమయంలో తన భర్తతో పాటు ఆమె కూడా అనేక సార్లు టెన్షన్ పడింది. అనేకసార్లు కెమెరా కంట పడిన నాదల్ భార్య కోసం ఇప్పుడు ఇంటర్నెట్ లో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆమె పేరు ఏంటి? ఆమెకు సంబంధించిన విశేషాలేంటో తెలుసుకుందాం. 



నాదల్ భార్య మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లో విశేషాలు..


మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లో


రఫెల్ నాదల్ భార్య పూర్తి పేరు మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లో. 1988 జులై 7న స్పెయిన్ లో జన్మించింది. బిజినెస్ లో గ్రాడ్యుయేట్ పట్టా పొందింది. ఆ తర్వాత ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగంతో కెరీర్ ను ప్రారంభించింది.  



నాదల్, పెరెల్లో ఎలా కలుసుకున్నారు?


కుటుంబ స్నేహితుల ద్వారా నాదల్, పెరెల్లో తొలిసారి కలుసుకున్నారని స్పానిష్ మీడియా సంస్థలు రకరకాల కథనాలు వచ్చాయి. అయితే నాదల్ తన మొదటి గ్రాండ్ స్లామ్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను 2005లో గెలుచుకున్న తర్వాత నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి వీరిద్దరి వివాహబంధాన్ని రహస్యంగా ఉంచారు. 


పెళ్లి ఎప్పుడు జరిగింది?


దాదాపు 14 ఏళ్లు డేటింగ్ లో ఉన్న తర్వాత నాదల్, పెరెల్లో పెళ్లి చేసుకున్నారు. 2019లో మల్లోర్కాలోని లా ఫోర్టలేజా కోటలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 



నాదల్ ను అర్థం చేసుకుంటూ..


నాదల్ వ్యక్తిగత జీవితంతో పాటు ఆయన టెన్నిస్ కెరీర్ ను బాగా అర్థం చేసుకొని.. అతడికి తగ్గట్టు నడుచుకుంది పెరెల్లో. నాదల్ కెరీర్ లోని అనేక సందర్భాల్లో అమె వెన్నుదన్నుగా నిలిచింది. వీరిద్దరికి పెళ్లి జరిగి మూడేళ్లు అవుతున్నా.. కెరీర్ పై దృష్టి పెట్టేందుకు ఈ దంపతులు పిల్లలను వద్దనుకున్నట్లు తెలుస్తోంది. కానీ, త్వరలోనే వారిద్దరూ పిల్లలను కనేందుకు సిద్ధంగా ఉన్నామని నాదల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.  


Also Read: Dhoni Buys Land Rover: ధోనీ గ్యారేజ్ లోకి మరో వింటేజ్ కారు.. వింటేజ్ ల్యాండ్ రోవర్ కొనుగోలు చేసిన మాజీ కెప్టెన్


Also Read: Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నాదల్.. 13 ఏళ్ల తర్వాత గెలుపు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook