Dhoni Buys Land Rover: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు వినగానే ఎవరికైనా.. టీమ్ఇండియా సారథిగా అతడు సాధించిన ట్రోఫీలు, రికార్డులే గుర్తొస్తాయి. కెప్టెన్‌గా టీమ్ఇండియాను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. భారత క్రికెట్ చరిత్రలో ధోనీకి ప్రత్యేక స్థానం ఉంది. ధోనీకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో.. వింటేజ్ కార్లు, బైకులన్నా అంతే ఇష్టం. వాటి కోసమే ఓ గ్యారేజ్‌ను ఏర్పాటు చేశాడంటే.. అవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇప్పుడు అతడి గ్యారేజ్‌లోకి మరో వింటేజ్ ల్యాండ్ రోవర్ కారు చేరింది. గత నెలలో గురుగ్రామ్‌లోని 'బిగ్ బాయ్ టాయ్జ్ (బీబీటీ)' అనే షోరూం నిర్వహించిన వేలంలో పాల్గొన్న ధోనీ.. 1970 మోడల్ ల్యాండ్ రోవర్ 3 కారును సొంతం చేసుకున్నాడు.
ఈ ల్యాండ్ రోవర్ కారుకు ఆటోమొబైల్ రంగంలో ప్రత్యేక స్థానం ఉంది. 1970 దశకం నుంచి 1980 మధ్య కాలం వరకు దీన్ని తయారు చేసేవారు. 2.25 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం గల ఈ కారు మ్యానువల్ ట్రాన్స్‌మిషన్‌తో నడుస్తుంది. ఆన్‌లైన్ వేలం ద్వారా 50 శాతానికి పైగా స్టాక్‌ను విక్రయించినట్లు బీబీటీ షోరూం పేర్కొంది. వీటితో పాటు అనేక క్లాసిక్ కార్లు ధోనీ గ్యారేజ్ లో ఉన్నాయి. వాటిలోని అత్యంత ఖరీదైన కార్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ధోనీ కారు గ్యారేజ్ లో ఉన్న ఖరీదైన కార్లు..
Porche 911 (పోర్చే 911)
ధోనీ గ్యారేజ్ లో పోర్చే 911 కారు ఉంది. దాని విలువ అక్షరాలు రూ.2 కోట్లుకు పైనే!ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌లోని నివేదిక ప్రకారం.. ఈ కారు ఐదు సెకన్లలోపు 0-100 నుంచి వేగాన్ని అందుకోగలదు.
ఫెరారీ 599 GTO
ధోనీకి సంబంధించిన సూపర్ కార్లలో ఫెరారీ 599 GTO కూడా ఒకటి. దీని విలువ సుమారు రూ.1.39 కోట్లు. అత్యంత శక్తివంతమైన V12 ఇంజిన్ తో ఈ కారు రూపొందింది. 2011 వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన తర్వాత టీమ్ఇండియా కెప్టెన్ గా ధోనీ ఈ కారును బహుమానంగా అందుకున్నాడు.
Confederate Hellcat X132
మహేంద్ర సింగ్ ధోనీకి కార్లతో పాటు బైకులంటే అమితమైన ప్రేమ. సుమారు రూ.27 లక్షల విలువైన కాన్ఫెడరేట్ హెల్ క్యాట్ X132 ని ధోనీ 2018లో కొనుగోలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ద్విచక్ర వాహనాల్లోకెల్లా ఇదే అత్యంత బరువైనది. 2.2 లీటర్ V- ట్విన్ ఇంజిన్ తో గరిష్టంగా 132 హార్స్ పవర్ ఉత్పత్తిని కలిగి ఉంది.
Hummer H2 (హమ్మర్ H2)
హమ్మర్ H2 మోడల్ కారు చాలా మంది క్రికెటర్ల గ్యారేజ్ లో ఉంది. ఈ కారులో ధోనీ అనేక సార్లు రాంచీలో చక్కర్లు కొట్టాడు. ఈ కారు విలువ సుమారు రూ.72 లక్షలు.
Pontiac Firebird Trans Am
2020లో క్లాసిక్ పోంటియాక్ ఫైర్ బర్డ్ ట్రాన్స్ యామ్ ను కూడా తన గ్యారేజ్ లో భాగం చేశాడు ధోనీ. దీని విలువ రూ.68 లక్షలు.
Also Read: IPL 2022, KL Rahul: లఖ్‌నవూ కెప్టెన్ గా కేఎల్ రాహుల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook