ప్రపంచ క్రికెట్‌లో బెస్ట్ లెగ్ స్పిన్నర్లలో ఒకడైన  ఆస్ట్రేలియా బౌలర్ ఆడమ్ జంపా (Adam Zampa) చాలా సంతోషంగా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) లాంటి మేజర్ లీగ్‌లో భాగస్వామిని కాబోతున్నానని చెబుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టు తరఫున స్పిన్నర్ జంపా బరిలోకి దిగనున్నాడు. తన భార్య ఇటీవల ఓ పండండి బిడ్డకు జన్మనివ్వడంతో కేన్ రిచర్డ్‌సన్ ఈ సీజన్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆడమ్ జంపాను జట్టులోకి తీసుకోనున్నట్లు బెంగళూరు జట్టు ఆర్సీబీ ఇటీవల ప్రకటించించడం తెలిసిందే. SR Patil Dies: భారత మాజీ క్రికెటర్ కన్నుమూత


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా టాలెంటెడ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్‌తో కలిసి బంతిని పంచుకోనుండటం గొప్ప అనుభూతి కానుందంటున్నాడు ఆడమ్ జంపా. ఇప్పటికే ఆర్సీబీలో చహల్, వాషింగ్టన్ సుందర్, మొయిన్ అలీ, పవన్ నేగీ, షాబాజ్ అహ్మద్ లాంటి స్పిన్నర్లతో ఉంది. ఇప్పుడు జంపా చేరడం ఆర్సీబీకి ప్లస్ కానుంది. ‘ఐపీఎల్‌లో ఆడనుండటం లక్కీగా భావిస్తున్నాను. చహల్‌తో కలిసి బంతిని షేర్ చేసుకోవడం సంతోషంగా ఉంటుంది. చహల్ నుంచి కొంత నేర్చుకునే వీలు దొరుకుతుంది. CSK In IPL 2020: సీఎస్కేను వీడని కరోనా కష్టాలు


ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. డెత్ ఓవర్లలో ఒత్తిడిని తట్టుకుని జట్టుకోసం బౌలింగ్ చేయడాన్ని ఎప్పటికీ ఆస్వాధిస్తాను. ఐపీఎల్‌లో గతంలో ఆడిన అనుభవం ఉంది. కానీ ఈ ఏడాది యూఏఈ వేదికగా ఆడనుండటం కాస్త కొత్తగా ఉందని’ ఆర్సీబీ స్పిన్నర్ ఆడమ్ జంపా చెప్పుకొచ్చాడు. గతంలో 2016, 2017 సీజన్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన ఆడమ్ జంపా 11 మ్యాచ్‌లలో 19 వికెట్లు పడగొట్టాడు. Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే.. 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR