Australia Cricket Team: ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఫించ్ తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కు ముగింపు పలికాడు. 2019 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను సెమీ-ఫైనల్‌కు తీసుకెళ్లాడు ఫించ్. 2021 వరల్డ్ కప్ లో ఇతడి నేతృత్వంలోని జట్టు ఏకంగా కప్ నే ఎగరేసుకు పోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే గత ఏడాది స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా లీగ్ దశలోనే నిష్క్రమించింది. దీంతో ఫించ్ తీవ్ర విమర్శలు ఎదుర్కోన్నాడు. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ తో ఫించ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. తొలి వన్డే 2013లో శ్రీలంకపై ఆడాడు. 2018లో పాకిస్థాన్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ లో ఫించ్ తొమ్మిది ఫ్రాంచైజీలకు ఆడాడు. ఇందులో రాజస్థాన్ రాయల్స్, పూణే వారియర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ లయన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ముంబై ఇండియన్స్‌ ఉన్నాయి. 


''12 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా.. 2024 టీ20 ప్రపంచకప్ వరకు నేను ఆడటం కష్టమే.. అందుకే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నా..'' అని ఫించ్ చెప్పుకొచ్చాడు. ఆరోన్ కంగూరు జట్టు తరుపున కేవలం 5 టెస్టు మ్యాచులు ఆడి 278 పరుగులు చేశాడు. 146 వన్డే మ్యాచుల్లో 17 సెంచరీలతో 5,406 పరుగులు సాధించాడు. 103 టీ20లు ఆడిన ఈ ఆసీస్ ఓపెనర్ రెండు సెంచరీలు, 19 అర్ధశతకాలతో 3,120 పరుగుల చేసి సత్తా చాటాడు. 


Also Read: IND vs AUS: ఆస్ట్రేలియాపై ఆడటమంటే విరాట్‌ కోహ్లీకి మహా ఇష్టం.. కారణం ఏంటో చెప్పిన భారత మాజీ కోచ్‌! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.