IND vs AUS: ఆస్ట్రేలియాపై ఆడటమంటే విరాట్‌ కోహ్లీకి మహా ఇష్టం.. కారణం ఏంటో చెప్పిన భారత మాజీ కోచ్‌!

Virat Kohli loves to banter against Australian players says Sanjay Bangar. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2023లో విరాట్‌ కోహ్లీ కీలకపాత్ర పోషిస్తాడని సంజయ్ బంగర్‌ ధీమా వ్యక్తం చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 6, 2023, 07:14 PM IST
  • ఆస్ట్రేలియాపై ఆడటమంటే కోహ్లీకి మహా ఇష్టం
  • కారణం ఏంటో చెప్పిన భారత మాజీ కోచ్‌
  • 48.05 సగటుతో 1682 పరుగులు
IND vs AUS: ఆస్ట్రేలియాపై ఆడటమంటే విరాట్‌ కోహ్లీకి మహా ఇష్టం.. కారణం ఏంటో చెప్పిన భారత మాజీ కోచ్‌!

Virat Kohli loves to play against Australia says Sanjay Bangar: ఫిబ్రవరి నెలలో భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2023 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 4 టెస్టుల సిరీస్‌లోని తొలి టెస్ట్ నాగపూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ఆరంభం కానుంది. ఏ  సిరీస్‌లో అయినా తొలి టెస్ట్ కీలకం కాబట్టి ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో మాజీలు అందరూ తమ తమా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్ బంగర్‌ స్పందించారు. ఆస్ట్రేలియాతో ఆడటమంటే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీకి ఎంతో ఇష్టమని తెలిపారు. 

బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2023లో (IND vs AUS) విరాట్‌ కోహ్లీ (Virat Kohli) కీలకపాత్ర పోషిస్తాడని సంజయ్ బంగర్‌ ధీమా వ్యక్తం చేశారు. స్టార్ స్పోర్ట్స్‌ ఇంటరాక్షన్ సందర్భంగా టీమిండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్ బంగర్‌ మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియాతో ఆడటాన్ని విరాట్‌ కోహ్లీ బాగా ఇష్టపడతాడు. అంతేకాదు ఆసీస్ ఆటగాళ్లను ఎగతాళి చేయడానికి కూడా ఇష్టపడతాడు. కోహ్లీ తన ఆటను తప్పకుండా మెరుగుపర్చుకుంటాడు. టెస్టు క్రికెట్‌ అనేది కోహ్లీ నుంచి అత్యుత్తమ ప్రదర్శనను తీసుకువచ్చే ఫార్మాట్ కూడా' అని అన్నారు. ఇటీవల ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. వన్డే, టీ20ల్లో సెంచరీలు చేశారు. అయితే టెస్టుల్లో శతకం బాది మూడేళ్లు దాటిపోయింది. 

'గత రెండున్నరేళ్లుగా విరాట్‌ కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. అయితే ఇటీవలి కాలంలో ఫామ్‌లోకి వచ్చి వన్డేలు, టీ20ల్లో పరుగులు చేశాడు. అదే ఫామ్ టెస్టుల్లో కూడా కొనసాగించాలనుకుంటున్నాడు. ఇక టెస్టు క్రికెట్‌పై అతడు దృష్టి పెట్టాలనుకుంటున్నాడు. కోహ్లీ మంచి ఆటతీరును కనబర్చి బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2023పై ప్రభావం చూపుతాడు. టెస్టు ఫార్మాట్‌లో ఎదురయ్యే సవాళ్లను విరాట్ అధిగమిస్తాడని నేను భావిస్తున్నా' అని భారత మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్ బంగర్‌ పేర్కొన్నారు. 

ఆస్ట్రేలియాపై ఇప్పటివరకు 20 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ.. 48.05 సగటుతో 1682 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా 104 టెస్టులు ఆడిన కోహ్లీ.. 48.09 సగటుతో 8119 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 254 నాటౌట్. మరోవైపు 271 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. మలేషియాలో జరిగిన 2008 అండర్19 క్రికెట్ ప్రపంచకప్ గెలుపొందిన భారత జట్టుకి కోహ్లీ సారథిగా వ్యవహరించాడు. ఆపై భారత జట్టులోకి వచ్చి స్టార్ అయ్యాడు. 

Also Read: Umran Malik: ఉమ్రాన్‌ మాలిక్‌ రికార్డ్ బ్రేక్ చేస్తా.. ఛాలెంజ్ విసిరిన పాకిస్తాన్ యువ పేసర్!  

Also Read: Earthquake in Turkey, Syria LIVE Updates: టర్కీలో మూడోసారి భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.0గా తీవ్రత!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News