ఆసియా క్రీడల్లో పతకం ఖాయం చేసిన భారత రెజ్లింగ్ స్టార్ భజరంగ్ పూనియా..!
భారత్‌కు చెందిన రెజ్లింగ్ క్రీడాకారుడు భజరంగ్ పూనియా ఆసియా క్రీడల్లో తన సత్తా చాటాడు.
భారత్‌కు చెందిన రెజ్లింగ్ క్రీడాకారుడు భజరంగ్ పూనియా ఆసియా క్రీడల్లో తన సత్తా చాటాడు. క్వార్టర్స్‌లో పూనియా తజకిస్థాన్‌కు చెందిన ఫైజీవ్ అబ్దుల్ ఖాసిమ్‌ను 12-2 తేడాతో ఓడించగా.. సెమీస్‌లో మంగోలియాకు చెందిన బచులున్‌పై 10-0 తేడాతో గెలిచి ఫైనల్స్‌కు దూసుకెళ్లి భారత్‌కు మరో పతకం ఖాయం చేశాడు. అయితే పురుషుల 97 కేజీ క్వార్టర్స్‌లో భారత క్రీడాకారుడు ఖత్రీ మౌసమ్ నిరాశ పరిచాడు. ఉజ్జెకిస్థాన్ క్రీడాకారుడు ఇబ్రాగి మాగోపై 0-8 తేడాతో పరాజయం పాలయ్యాడు.
పురుషుల 86 కేజీల విభాగంలో కూడా భారత రెజ్లర్ పవన్‌కుమార్ 0-11 తేడాతో ఇరాన్ ఆటగాడు హసన్‌పై ఓడిపోయాడు. జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈ సారి భారత్ తరఫున 500 పైగానే క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీ పడుతున్నారు.
ఈసారి రెజ్లింగ్‌లో పతకం ఖాయం చేసిన స్టార్ ఆటగాడు భజరంగ్ పూనియా 2013 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచాడు. అలాగే అదే సంవత్సరం నిర్వహించిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా కాంస్యం గెలుచుకున్నాడు. అలాగే కామన్వెల్త్ గేమ్స్ 2018లో పసిడి పతకం కూడా గెలుచుకున్నాడు పూనియా. 2015లో అర్జున్ అవార్డు కూడా పొందాడు పూనియా.