Pakistan Batter Asif Ali hits Afghanistan Bowler Fareed Ahmed Malik: ఆసియా క‌ప్‌ 2022లో సూప‌ర్‌ 4లో భాగంగా పాకిస్థాన్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ‌ రేపింది. ఇక అఫ్గాన్‌ విజయం ఖాయం అనుకున్న సమయంలో రెండు సిక్స‌ర్లు బాదిన పాక్ బౌలర్ నసీమ్‌ షా ఊహించని విజయాన్ని అందించాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ 6 వికెట్లకు 129 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్‌ (35) టాప్‌ స్కోరర్‌. లక్ష్యాన్ని పాకిస్థాన్‌ 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షాదాబ్‌ ఖాన్‌ (36), ఇఫ్తికార్‌ అహ్మద్‌ (30) రాణించారు. అయితే ఈ మ్యాచులో అఫ్గానిస్థాన్‌ బౌలర్‌ను పాకిస్తాన్ బ్యాటర్ కొట్టబోయాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాకిస్తాన్ విజయానికి 12 బంతుల్లో 21 పరుగులు అవసరం అయ్యాయి. అఫ్గానిస్థాన్‌ బౌలర్ ఫరీద్ అహ్మద్ వేసిన 19వ ఓవర్‌ రెండో బంతికి హ్యారీస్ రౌఫ్ (0) డక్‌గా వెనుదిరగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నసీమ్‌ షా మూడో బంతికి సింగల్ తీశాడు. నాలుగో బంతికి అసిఫ్ అలీ సిక్సర్ బాదాడు. ఆ మరుసటి బంతికే అలీ క్యాచ్ ఔట్‌ అయ్యాడు. దాంతో ఫరీద్ అహ్మద్ ఆనందం పట్టలేక.. గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఆపై అలీ మీదుకు ఫ‌రీద్‌ వెళ్లాడు. అప్పటికే ఔట్ అయ్యానని అసహనంలో ఉన్న అలీ.. ఫ‌రీద్‌ అలా చేయడంతో చిత్రీటిపోయాడు. తన చేతిలో ఉన్న బ్యాటుతో తల పగులుద్ది అంటూ హెచ్చరించాడు. 



ఫరీద్ అహ్మద్, అసిఫ్ అలీ మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకునే సమయంలో అఫ్గాన్ ప్లేయర్, అంపైర్ జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్రీడా స్పూర్తికి విరుద్దంగా ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించిన ఇద్దరిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అసిఫ్ అలీ చేయడం సరికాదు, అసిఫ్ అలీని బ్యాన్ చేయండి అంటూ ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక చివ‌రి ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. న‌సీమ్ షా తొలి రెండు బంతుల్లో సిక్స‌ర్లు బాదాడు. దాంతో ఆఫ్ఘ‌న్ ఆసియా క‌ప్‌ 2022 బెర్త్ ఆశ‌లు ఆవిర‌య్యాయి. అదే సమయంలో భారత్‌ కథ కూడా అధికారికంగా ముగిసింది. 


Also Read: పాకిస్తాన్ అభిమానులను చితకబాదిన అఫ్గానిస్థాన్‌ ఫాన్స్.. టీమిండియా ఫాన్స్ ఫుల్ ఖుషి!


Also Read: వైరల్‌ వీడియో.. కన్నీరు పెట్టుకున్న హీరో నాగార్జున! కారణం ఏంటంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి