Indian Fans are Full Hapy after AFG fans Beat up PAK Fans: అది దాయాదులు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కాదు.. అయినా కూడా చివరి ఓవర్ వరకు ఫాన్స్ ఉత్కంఠభరితంగా చూశారు. ఆసియా కప్ 2022 సూపర్ 4లో భాగంగా బుధవారం పాకిస్తాన్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు చాలా ఆసక్తికరంగా చూశారు. భారత్ అభిమానుల్లో ఆశలు రేపేలా ఉత్కంఠ రేకెత్తించిన ఈ మ్యాచ్‌లో చివరకు పాకిస్తానే వికెట్ తేడాతో అఫ్గాన్‌పై విజయం సాదిందింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం షార్జా క్రికెట్ స్టేడియంలో పాక్, అఫ్గాన్ అభిమానుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.
మ్యాచ్ అనంతరం పాకిస్తాన్, అఫ్గానిస్థాన్ జట్ల అభిమానుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఓటమిని తట్టుకోలేని అఫ్గాన్ అభిమానులు షార్జా క్రికెట్ స్టేడియంలోని కుర్చీలను విరగొట్టారు. స్టేడియంలో కుర్చీలను చిందరవందరగా పడేశారు. అంతేకాదు వాటిని పాక్ అభిమానులపైకి విసిరేశారు. కొందరు అఫ్గాన్ ఫాన్స్ పక్కనే ఉన్న పాక్ అభిమానులను చితకబాదారు. పాక్ జెర్సీ వేసుకున్న ఓ వ్యక్తిని మరో వ్యక్తి కుర్చీతో కొట్టాడు. అఫ్గానిస్థాన్ జిందాబాద్ అనే నినాదాలతో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. పాక్ ఫాన్స్ సంబురాలు చేసుకోవడంతోనే ఈ గొడవ మొదలైంది.
పాక్, అఫ్గాన్ ఫాన్స్ గొడవకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసి మండిపడ్డారు. 'అఫ్గానిస్థాన్ అభిమానులు ఏం చేశారో మీరే చూడండి. గతంలో కూడా చాలా సార్లు ఇలాగే గొడవ చేశారు. ఇది ఒక గేమ్ మాత్రమే.. క్రీడా స్ఫూర్తితో ఆడాలి. ఆటలో గెలుపోటములు ఉంటాయి. గెలుపు, ఓటములను ఒకేలా స్వీకరించాలి. క్రికెట్ ఆటలో ఎదగాలనుకుంటే.. మీ ప్లేయర్స్, ఫాన్స్ కొన్ని విషయాలు నేర్చుకోవాలి' అని అఫ్గాన్ క్రికెట్ బోర్డు మాజీ సీఈవో షఫీక్ స్టానిక్‌జాయ్‌ను ట్యాగ్ చేశారు.
This is what Afghan fans are doing.
This is what they've done in the past multiple times.This is a game and its supposed to be played and taken in the right spirit.@ShafiqStanikzai your crowd & your players both need to learn a few things if you guys want to grow in the sport. pic.twitter.com/rg57D0c7t8— Shoaib Akhtar (@shoaib100mph) September 7, 2022
పాక్, అఫ్గాన్ ఫాన్స్ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతొంది. ఈ వీడియోకి కామెంట్ల వర్షం కురుస్తోంది. 'టీమిండియా ఫాన్స్ ఫుల్ ఖుషి' అయుంటారు అని ఒకరు ట్వీట్ చేశారు. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో పాక్ 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది.
Also Read: వైరల్ వీడియో.. కన్నీరు పెట్టుకున్న హీరో నాగార్జున! కారణం ఏంటంటే
Also Read: Viral Video: ఏనుగుకి దురద వేస్తే ఇట్లనే ఉంటది మరి.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి