Kobe Bryant Death: దిగ్గజ ఆటగాడు కోబ్ బ్రయింట్ దుర్మరణంపై కేటీఆర్ దిగ్భ్రాంతి
KTR । నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) ఆల్ టైమ్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన కోబ్ బ్రయింట్ దుర్మరణం చెందారు. హెలికాప్టర్ ప్రమాదంలో బ్రయింట్, కుతురుతో పాటు మరో ఏడుగురు మరణించారు.
బాస్కెట్ బాల్ దిగ్గజ ఆటగాడు కోబ్ బ్రయింట్ దుర్మరణం చెందాడు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో కోబ్ బ్రయింట్(41), 13 ఏళ్ల ఆయన కూతురు జియానా సహా 9 మంది మృతిచెందారు. ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుందని నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) ఓ ప్రకటనలో తెలిపింది. కోబ్ బ్రయింట్ ప్రయాణిస్తోన్న నిక్సోర్సికి ఎస్76 అనే హెలికాప్టర్ కొండను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం.
బాస్కెట్ బాల్ దిగ్గజం మృతి పట్ల ఎన్‌బీఏ కమిషనర్ అడం సిల్వర్ సంతాపం ప్రకటించారు. బ్రయింట్ భార్య వనెస్సాకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే బ్రయింట్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, బ్రయింట్ కుటుంబానికి అండగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా, 2008, 2012 ఒలింపిక్స్ గేమ్స్‌లో అమెరికా స్వర్ణ పతకాలు సాధించడంలో బ్రియాంట్‌ది కీలకపాత్ర వహించాడు.
కోబ్ బ్రయింట్ దుర్మరణం చెందడంపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన అభిమాన ఆటగాడు బ్రయింట్, ఆయన కుమార్తె చనిపోయారని తెలియడంతో షాక్‌కు గురయ్యానని ట్వీట్ చేశారు. ఆయనకు కన్నీటి నివాళి అంటూ అభిమాన ఆటగాడు బ్రయింట్ మృతిపట్ల తన ఆవేదనను వ్యక్తం చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..