అదృష్టం అంటే ఇదేమరి.. బౌల్డ్ అయినా బ్యాటింగ్ కొనసాగించిన బ్యాటర్!! (వీడియో)
సరైన బంతికి బౌల్డ్ అయినా.. ఓ బ్యాటర్ బతికిపోయిన ఘటన మనం ఎప్పుడూ చూసి ఉండం. తాజాగా ఆస్ట్రేలియాలోని మహిళల దేశవాళీ క్రికెట్‌లో అటువంటి ఘటనే జరిగింది.
Batter Gets Bowled But Survives In Bizarre Incident In Australia's Women Domestic Match: క్రికెట్ ఆటలో అప్పుడప్పుడూ కొన్ని ఆసక్తికర, ఎవరూ ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఫీల్డర్లు ఎవరూ ఊహించని రీతిలో క్యాచ్‌లు పట్టి అందరిని ఆచార్యానికి గురిచేస్తుంటారు. బ్యాటర్లు కళ్లుచెదిరే రీతిలో సిక్సులు బాదడం, సెంచరీలు చేస్తుంటారు. అప్పుడప్పుడు నో బాల్‌కు అవుట్ అయిన ఘటనలు క్రికెట్ ఆటలో ఉంటాయి. అదే సమయంలో నో బాల్‌కు బతికిపోయిన సంఘటనలు కూడా ఉంటాయి. అయితే సరైన బంతికి బౌల్డ్ అయినా.. ఓ బ్యాటర్ (Batter) బతికిపోయిన ఘటన మాత్రం మనం ఎప్పుడూ చూసి ఉండం. తాజాగా ఆస్ట్రేలియాలోని మహిళల దేశవాళీ క్రికెట్ (Australia's Women Domestic Matchg)లో అటువంటి ఘటనే జరిగింది.
తాజాగా ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో భాగంగా క్వీన్స్‌లాండ్, టాస్మానియా (Queensland vs Tasmanian) జట్ల మధ్య ఒక వన్డే మ్యాచ్ జరిగింది. క్వీన్స్‌లాండ్ ఓపెనర్ జార్జియా వోల్ (Georgia Voll) స్ట్రైక్ ఎండ్‌లో ఉండగా.. టాస్మానియా పేసర్ బెలిండా వకరేవా (Belinda Vakarewa) బౌలింగ్ చేశారు. ఇన్నింగ్స్ 14 ఓవర్ నాలుగో బంతికి జార్జియా బౌల్డ్ అయ్యారు. బంతి బ్యాట్‌ను దాటుకుంటూ వెళ్లి ఆఫ్ స్టంప్ పైనున్న బెయిల్స్‌ను తాకుతూ వెళ్లింది. దీంతో ఓ బెయిల్ కిందపడింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. బంతి వికెట్లకు దూరంగా వెళుతుండడంతో కీపర్ దానికోసం పరుగెత్తారు. బెయిల్ కిందపడిన విషయాన్ని కీపర్ గుర్తించలేదు. మరోవైపు బౌలర్ వకరేవా కూడా అప్పీల్ చేయలేదు. ఇక అంపైర్లు అయితే మౌనంగా ఉండిపోయారు. దాంతో అవుట్ అయినా కూడా జార్జియా బతికిపోయారు.
ALso Read: KGF 2 Movie: కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్‌కు ముహూర్తం ఖరారు.. ఎప్పుడో తెలుసా?
కీపర్ గ్లోవ్స్ తాకి బెయిల్స్ పడి ఉండొచ్చని మైదానంలోని మిగతా ప్లేయర్స్ అనుకున్నారు. అయితే రీప్లేలో ఆ బంతి బెయిల్స్ అంచులు తాకుతూ వెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. అయినా లాభం లేకుండా పోయింది. అప్పటికే జార్జియా వోల్ (Georgia Voll) మరో బంతిని ఆడేశారు. 26 పరుగుల వద్ద ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జార్జియా.. చివరికి 31 పరుగుల వద్ద పెవిలియన్ చేరారు. ఇందుకు సంబందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బ్యాటర్, అంపైర్లను ఆడేసుకుంటుంటారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన క్వీన్స్‌లాండ్ 48 ఓవర్లలో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అనంతరం టాస్మానియా విజయం సాధించింది.
Also Read: IND vs SA: టీమిండియాతో సిరీస్.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్! డైరెక్టర్, కోచ్‌పై విచారణ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook