BCCI allowed Fans for IND vs WI 3rd T20I in Eden Gardens: టీమిండియా అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త చెప్పింది. కోల్‌కతాలోని ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా అక్టోబర్ 20న భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే మూడో టీ20 మ్యాచుకు ప్రేక్షకులను అనుమతించనున్నారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా కేవలం 20 వేల మంది అభిమానులను అనుమతించేలా బీసీసీఐ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈడెన్ మైదానం కెపాసిటీ 68 వేలు కాగా.. కేవలం 20 వేల మంది మాత్రమే మ్యాచును వీక్షించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రికెట్​ అసోసియేషన్​ ఆఫ్​ బెంగాల్ (సీఏబీ)​ అభ్యర్థన మేరకు బోర్డు సభ్యులతో చర్చించి.. మూడో టీ20 మ్యాచుకు ప్రేక్షకులను అనుమతించాలానే నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈరోజు ఉదయం పేర్కొన్నారు. ఇదే విషయం సీఏబీ చీఫ్ అవిషేక్ దాల్మియాకు ఇ మెయిల్‌లో రాశారు. 'మీ ప్రతిపాదన మేరకు బీసీసీఐ ఆఫీస్​ బేరర్లతో చర్చించాం. వెస్టిండీస్​తో జరగబోయే మూడో టీ20 మ్యాచ్​కు ప్రేక్షకులను అనుమతించొచ్చు' అని గంగూలీ మెయిల్‌లో పేర్కొన్నారు. 


బీసీసీఐ నిర్ణయంతో సీఏబీ సభ్యులకు సహా దాని అనుబంధ క్రికెట్​ సంఘాలకు ఉచిత టికెట్లు పంపిణి చేసేందుకు అవకాశం దక్కింది. తమ ప్రదిపాదనను పరిగణలోకి తీసుకుని ప్రేక్షకులకు అనుమతి ఇచ్చినందుకు బీసీసీఐ బోర్డుకు సీఏబీ కృతజ్ఞతలు తెలిపింది. ఆటగాళ్ల ప్రాణాలను పణంగా పెట్టలేమని ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్న విషయం తెలిసిందే. గతేడాది నవంబర్‌లో జరిగిన భారత్-న్యూజిలాండ్ టీ20కి 70 శాతం మంది ప్రేక్షకులను అనుమతించారు.


ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. నికోలస్ పూరన్‌ (61; 43 బంతుల్లో 4×4, 5×6) హాఫ్ సెంచరీ చేశాడు. భారత యువ బౌలర్ రవి బిష్ణోయ్‌ (2/17) సత్తాచాటాడు. లక్ష్య ఛేదనలో నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (40; 19 బంతుల్లో 4×4, 3×6), సూర్యకుమార్‌ యాదవ్ (34 నాటౌట్‌; 18బంతుల్లో 5×4, 1×6) విజయంలో కీలక పాత్ర పోషించారు.


Also Read: Google Pay Loans: గూగుల్ పే బంపరాఫర్.. చిటికెలో రూ. 1 లక్ష లోన్


Also Read: AP Hijab Row: ఏపీలోనూ హిజాబ్ దుమారం.. హిజాబీ విద్యార్థినులను అనుమతించని లయోలా కాలేజీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook