Google Pay Loans: గూగుల్ పే బంపరాఫర్.. చిటికెలో రూ. 1 లక్ష లోన్

Google Pay Loans: ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ యాప్ గూగుల్ నుంచి గుడ్‌న్యూస్ ఇది. గూగుల్ పే యూజర్లకు అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఆ ఆఫర్ వివరాలు ఇవీ..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 17, 2022, 11:50 AM IST
Google Pay Loans: గూగుల్ పే బంపరాఫర్.. చిటికెలో రూ. 1 లక్ష లోన్

Google Pay Loans: ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్ యాప్ గూగుల్ నుంచి గుడ్‌న్యూస్ ఇది. గూగుల్ పే యూజర్లకు అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఆ ఆఫర్ వివరాలు ఇవీ..

దేశంలో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. రోజురోజుకూ ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రారభమైనప్పటి నుంచి ఆన్‌లైన్ పేమెంట్స్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్ ఉపయోగించేవారి సంఖ్య బాగా పెరిగింది. ఈ క్రమంలో యూజర్లను ఆకట్టుకునేందుకు గూగుల్ పే అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. గూగుల్ పే యూజర్లకు లక్ష రూపాయల వరకూ వ్యక్తిగత రుణాన్ని అందించనున్నామని ప్రకటించింది. అయితే గూగుల్ పే అందించే ఈ రుణం తీసుకోవాలంటే క్రెడిట్ స్కారు బాగుండాలి. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే లక్ష రూపాయల వరకూ పర్సనల్ లోన్ వస్తుంది.

గూగుల్ పే ప్రీ క్వాలిఫైడ్ యూజర్లకు డీఎమ్ఐ ఫైనాన్స్ కంపెనీ సౌజన్యంతో ఈ పర్సనల్ లోన్ ఆఫర్ అందుబాటులో తీసుకొస్తోంది. అర్హత కలిగిన యూజర్లకు కేవలం నిమిషాల వ్యవధిలోనే లక్ష రూపాయల వరకూ పర్సనల్ లోన్ అందుతుంది. రుణాన్ని తిరిగి చెల్లించేందుకు 36 నెలల కాల వ్యవధి ఉంటుంది. గూగుల్ పే వినియోగించే ప్రతి ఒక్కరికీ ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు కానీ..క్రెడిట్ స్కోర్ బాగుంటే కచ్చితంగా లభిస్తుంది. లక్షలాదిమంది గూగుల్ పే వినియోగదారులకు పారదర్శకంగా, వేగంగా రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని డీఎమ్ఐ ఫైనాన్స్ వెల్లడించింది. రానున్న రోజుల్లో ఈ సదుపాయాన్ని మరింతమందికి చేర్చేందుకు కృషి చేస్తామంటోంది. 

Also read: Viral Videos: సింహం నోట్లోంచి తప్పించుకునేందుకు నీళ్లలో దూకింది.. కానీ ఇంతలోనే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News