U19 World Cup 2022: అండర్-19 వరల్డ్ కప్ విజేతగా భారత్.. కుర్రాళ్లకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ..!
U19 World Cup 2022: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2022ను యువభారత్ గెలుచుకుంది. దీంతో బీసీసీఐ నజరానా ప్రకటించింది.
U19 World Cup 2022: రికార్డు స్థాయిలో ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ 2022 గెలుచుకుంది యువభారత్. కుర్రాళ్లు దుమ్మురేపటంతో..ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టుపై టీమిండియా 4 వికెట్ల తేడాతో జయభేరీ మోగించింది. కరేబియన్ గడ్డపై ఆల్ రౌండ్ షో తో అదరగొట్టిన భారత యువ జట్టును..బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, సెక్రటరీ జైషా అభినందించారు. అంతేకాకుండా ఒక్కొక్క ఆటగాడికి రూ. 40 లక్షలు, సహాయ సిబ్బందికి రూ.25లక్షల చొప్పున బహుమతి ప్రకటించారు.
మెుదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. టీమిండియా పేసర్లు రాజ్ బవా(5/31), రవికుమార్(4/34)ల ధాటికి ఇంగ్లీష్ జట్టు 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. బ్యాటర్ జేమ్స్ రూ(116 బంతుల్లో 95; 12 ఫోర్లు) అద్భుతమైన ఆటతో ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆటగాళ్లు మరో 2 బంతులు మిగిలి ఉండగానే చేధించారు. బ్యాటర్లు షేక్ రషీద్, నిషాంత్‌లు టీమిండియా (Team India) విజయంలో కీలకపాత్ర పోషించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Facebook , Twitter మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి