ICC U19 World Cup Final: కుమ్మేసిన కుర్రాళ్లు.. ఐదోసారి అండర్‌-19 ప్రపంచకప్‌ గెలుచుకున్న యువ భారత్

U-19 WC Final: అండర్‌-19 ప్రపంచకప్‌ 2022 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో ఇంగ్లాండ్‌పై  గెలిచి ఐదోసారి కప్ ను తన ఖాతాలో వేసుకుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 6, 2022, 07:23 AM IST
  • భారత్‌కు అయిదో అండర్‌-19 ప్రపంచకప్‌
  • ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం
  • రాణించిన బవా, రవి, రషీద్‌, నిశాంత్‌
ICC  U19 World Cup Final: కుమ్మేసిన కుర్రాళ్లు.. ఐదోసారి అండర్‌-19 ప్రపంచకప్‌ గెలుచుకున్న యువ భారత్

India vs England, U19 World Cup Final: కుర్రాళ్లు అదరగొట్టడంతో...ఐదోసారి అండర్‌-19 ప్రపంచకప్‌ (ICC  U19 World Cup) తన ఖాతాలో వేసుకుంది భారత్ (Team india).  ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. చివరగా యువ జట్టు 2018లో కప్పు గెలిచింది.

తొలుత టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్ (England) జట్టు 44.5 ఓవర్లలో 189 పరుగులకు కుప్పకూలింది. పేసర్లు రాజ్‌ బవా (5/31), రవికుమార్‌ (4/34) ఆ జట్టును దెబ్బ తీశారు. జేమ్స్‌ ర్యూ (95; 116 బంతుల్లో 12×4) గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. జేమ్స్‌ సేల్స్‌ (34 నాటౌట్‌; 65 బంతుల్లో 2×4) అతడికి సహకారమందించాడు. అనంతరం ఆంధ్రా కుర్రాడు షేక్‌ రషీద్‌ (50; 84 బంతుల్లో 6×4)తో పాటు నిశాంత్‌ సింధు (50 నాటౌట్‌; 54 బంతుల్లో 5×4, 1×6), రాజ్‌ బవా (35: 54 బంతుల్లో 2×4, 1×6) సత్తా చాటడంతో లక్ష్యాన్ని భారత్‌ 47.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Also Read: ICC U19 World Cup 2022: అదరగొట్టిన కుర్రాళ్లు- 189 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: థామస్‌ (సి) ధుల్‌ (బి) బవా 27; బెతెల్‌ ఎల్బీ (బి) రవి 2; ప్రెస్ట్‌ (బి) రవి 0; జేమ్స్‌ (సి) తంబె (బి) రవి 95; లక్స్‌టన్‌ (సి) బానా (బి) బవా 4; బెల్‌ (సి) బానా (బి) బవా 0; రెహాన్‌ అహ్మద్‌ (సి) తంబె (బి) బవా 10; హార్టన్‌ (సి) ధుల్‌ (బి) తంబె 10; సేల్స్‌ నాటౌట్‌ 34; అస్పిన్‌వాల్‌ (సి) బానా (బి) రవి 0; బోడెన్‌ (సి) బానా (బి) బవా 1; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం:(44.5 ఓవర్లలో ఆలౌట్‌) 189;

భారత్‌ ఇన్నింగ్స్‌: రఘువంశీ (సి) హార్టన్‌ (బి) బోడెన్‌ 0; హర్నూర్‌ (సి) హార్టన్‌ (బి) అస్పిన్‌వాల్‌ 21; రషీద్‌ (సి) జేమ్స్‌ (బి) సేల్స్‌ 50; యశ్‌ ధుల్‌ (సి) బెల్‌ (బి) సేల్స్‌ 17; నిశాంత్‌ నాటౌట్‌ 50; బవా (సి) ప్రెస్ట్‌ (బి) బోడెన్‌ 35; తంబె (సి) రెహన్‌ (బి) అస్పిన్‌వాల్‌ 1; బానా నాటౌట్‌ 13; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (47.4 ఓవర్లలో 6 వికెట్లకు) 195.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News