BCCI Annual Contract: 2022-23 సంవత్సరానికి ఆటగాళ్ల వార్షిక ఒప్పందాన్ని ప్రకటించింది బీసీసీఐ. సంజూ శాంసన్ , కేఎస్ భరత్ వంటి ఆటగాళ్లు తొలిసారిగా ప్రవేశం పొందగా.. రహానే, భువనేశ్వర్‌లతో పాటు మయాంక్ అగర్వాల్, దీపక్ చాహర్, హనుమ విహారి, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా పేర్లను తొలగించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలకు ఏ+ కేటగిరీలో చోటు దక్కింది. వెన్ను నొప్పి గాయంతో ఏడాదిగా క్రికెట్‌కు దూరంగా ఉన్న బూమ్రా పేరు ఏ+ కేటగిరీలో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ స్పీడ్ స్టార్ పునరాగమనంపై ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన రాలేదు. ఏ+ కేటగిరీ ఆటగాళ్లకు రూ.7 కోట్లు చెల్లిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏ కేటగిరీలో ఐదుగురు ఆటగాళ్లకు చోటు కల్పించింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిషబ్ పంత్, అక్షర్ పటేల్‌ ఏ కేటగిరీలో ఉన్నారు. వీరికి ఏటా రూ.5 కోట్లు లభిస్తాయి. బి కేటగిరీలో ఆరుగురు ఆటగాళ్లు ఉన్నారు. టెస్టు బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారాతో పాటు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ ఉన్నారు. ఈ కేటగిరీ ఆటగాళ్లకు బీసీసీఐ ఏటా 3 కోట్ల రూపాయలను అందజేస్తుంది.


 




11 మంది ఆటగాళ్లు సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. దీపక్ హుడా, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్‌లతో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ శాంసన్, కేఎస్ భరత్ తొలిసారిగా బీసీసీఐ వార్షిక కాంట్రాక్టును పొందారు. ఈ ఆటగాళ్లందరినీ సి కేటగిరీలో చేర్చారు. వీరితో పాటు ఉమేష్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ సి కేటగిరీలో ఉన్నారు. ఈ కేటగిరీకి చెందిన ఆటగాళ్లు ఏటా కోటి రూపాయలు పొందుతారు.


కుల్దీప్ యాదవ్ బీసీసీఐ కాంట్రాక్ట్‌లోకి ఎంట్రీ ఇవ్వగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్‌లకు ప్రమోషన్ లభించింది. కేఎల్ రాహుల్, శార్దూల్ ఠాకూర్ కేటగిరీ తగ్గింది. 


Also Read: YCP Offer: జేడీ లక్ష్మీనారాయణకు వైసీపీ ఆఫర్ఆ, హామీ ఇస్తే ఓకే అంటున్న సీబీఐ మాజీ జేడీ


Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి