Indian cricket team: టీమిండియా కొత్త స్పాన్సర్‌గా డ్రీమ్11 ఎంపికైంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) ధృవీకరించింది. ఇప్పటి వరకు స్పాన్సర్ గా ఉన్న బైజూస్ స్థానంలో మూడేళ్ల కాలానికి (2023-25) డ్రీమ్11 స్పాన్సర్‌గా వ్యవహారించనుంది. వెస్టిండీస్ పర్యటన నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఇకపై భారత ఆటగాళ్లు డ్రీమ్ 11 లోగో కలిగిన జెర్సీలతో బరిలోకి దిగనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''ఇకపై భారత క్రికెట్ టీమ్ కు ప్రధాన స్పాన్సర్‌గా డ్రీమ్11 వ్యవహారించనుంది. ఇది మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నాం. బీసీసీఐ-డ్రీమ్ 11 పార్టనర్ షిప్ క్రికెట్ ఫ్యాన్స్ కు మరింత చేరువుతుందని ఆశిస్తున్నాం'' అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ వెల్లడించారు. ''గతంలో బీసీసీఐతో చాలా ఏళ్లపాటు భాగస్వామిగా ఉన్నాం. మళ్లీ ఇప్పుడు స్పాన్సర్‌గా వ్యవహారించడం గర్వకారణంగా ఉంది. భారత క్రీడారంగానికి ఎల్లప్పుడూ మా సపోర్టు ఉంటుంది'' అని డ్రీమ్ స్పోర్ట్స్ సీఈవో హర్ష జైన్ తెలిపారు. 


కిట్ స్పాన్సర్ గా ఆడిదాస్ 
మరోవైపు భారత కిట్ స్పాన్సర్ గా ఆడిదాస్ బీసీసీఐ ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా ఆటగాళ్ల కోసం కొత్త జెర్సీలను కూడా రిలీజ్ చేసింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభ నేపథ్యంలో... వాంఖడే స్టేడియం వేదికగా మూడు ఫార్మాట్లకు సంబంధించిన జెర్సీలను ఆవిష్కరించింది. ఈ విషయాన్ని ఆడిదాస్ తమ అధికార ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది కూడా. ఈ జెర్సీలను ధరించి టీమిండియా ఆటగాళ్లు ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. 


Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడిన అజిత్ అగార్కర్, షేన్ వాట్సన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook