BCCI Prize Money: సుదీర్ఘ కాలం తర్వాత ప్రపంచకప్‌ కలను నెవవేర్చిన భారత క్రికెట్‌ జట్టుకు ఊహించని రీతిలో భారీ బహుమతి లభించింది. విదేశీ గడ్డపై భారత జెండాను రెపరెపలాడించిన క్రికెట్‌ జట్టుపై కానుకల వర్షం కురిసింది. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ట్రోఫిని ముద్దాడిని టీమిండియాకు భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) భారీ నగదు బహుమతిని ప్రకటించింది. అక్షరాలా రూ.125 కోట్ల నగదు బహుమతిని కానుకగా అందించింది. ఈ విషయాన్ని బోర్డు చైర్మన్‌ జై షా ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Ravindra Jadeja: దోస్త్‌ మేరా దోస్త్‌.. కోహ్లీ, రోహిత్‌ బాటలోనే రవీంద్ర జడేజా ఆటకు వీడ్కోలు


'ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచకప్‌ 2024 గెలిచిన భారత జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని ప్రకటిస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ప్రపంచకప్‌ మొత్తం భారత జట్టు అసాధారణ ప్రతిభ, దృఢ సంకల్పం, క్రీడా నైపుణ్యం ప్రదర్శించింది. అత్యుత్తమ విజయం సాధించిన ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయ సిబ్బందికి అభినందనలు' అంటూ జై షా 'ఎక్స్‌'లో పోస్టు చేశారు.

Also Read: Virat Kohli Retirement: సంబరాల మధ్య విరాట్‌ కోహ్లీ సంచలనం.. టీ20 క్రికెట్‌కు వీడ్కోలు


అమెరికా వేదికగా శనివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై చారిత్రాత్మక విజయం సాధించిన భారత్‌ టీ 20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఐసీసీ నిర్వహించిన ఈ టోర్నీలో విజేతకు అంటే భారత జట్టుకు రూ.20.42 కోట్ల (2.45 మిలియన్‌ డాలర్లు) నగదు బహుమతి లభించింది. రన్నరప్‌గా నిలిచిన సఫారీలకు రూ.10.67 కోట్లు (1.28 మిలియన్‌ డాలర్లు) నగదు బహుమతి దక్కింది. కాగా విజయం సాధించిన భారత జట్టు ప్రస్తుతం ఇంకా విదేశీ గడ్డపైనే ఉంది. రెండు మూడు రోజుల్లో స్వదేశం రానుంది.


స్వదేశానికి ప్రపంచకప్‌ తీసుకువస్తున్న భారత క్రికెట్‌ జట్టుకు స్వాగతం పలికేందుకు అఖండ భారతదేశం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ట్రోఫీ సాధించిన సందర్భంగా శనివారం అర్ధరాత్రి మొత్తం భారత్‌ నిద్రపోలేదు. వీధుల్లోకి వచ్చి కేరింతలు కొడుతూ.. కేక్‌లు కోస్తూ.. టపాసులు పేలుస్తూ.. ర్యాలీలు తీస్తూ.. నినాదాలు చేస్తూ హోరున సంబరాలు చేసుకున్నారు. ఇక ట్రోఫీని పట్టుకుని వస్తున్న ఆటగాళ్లకు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. కాగా ప్రపంచకప్‌ ట్రోఫీతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లేకపోతే ప్రధాన నగరాల్లో భారత జట్టు పర్యటించాలని అభిమానులు కోరుతున్నారు.



 


 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter