Virat Kohli Retirement: సంబరాల మధ్య విరాట్‌ కోహ్లీ సంచలనం.. టీ20 క్రికెట్‌కు వీడ్కోలు

Virat Kohli Anounces Retirement From T 20I Cricket: భారత క్రికెట్‌ జట్టు చరిత్రలో విరాట్‌ కోహ్లీ పేరు చెరిగిపోనిది. టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన ఆనందంలో కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. తన ఆటకు వీడ్కోలు పలికాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 30, 2024, 12:39 AM IST
Virat Kohli Retirement: సంబరాల మధ్య విరాట్‌ కోహ్లీ సంచలనం.. టీ20 క్రికెట్‌కు వీడ్కోలు

Virat Kohli Retires From T20I: చిరుతలా పరుగెత్తడం.. బంతి దొరికితే చాలు చితక్కొట్టుడే.. బ్యాట్‌ పడితే విధ్వంసమే.. ఇలా తన బ్యాట్‌తో ఎన్నో రికార్డులు తిరగరాసి భారత క్రికెట్‌ చరిత్రలో చెరిగిపోని ముద్ర వేసిన విరాట్‌ కోహ్లీ పొట్టి క్రికెట్‌కు ముగింపు పలికాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌లో విజయం సాధించిన అనంతరం ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకుంటూ సంచలన ప్రకటన చేశాడు. ఇదే నా చివరి ప్రపంచ కప్‌ అని ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు.

Also Read: T20 World Cup 2024: అమెరికా గడ్డపై భారత్‌ రెపరెపలు.. సమష్టి కృషితో టీ20 ప్రపంచకప్‌ కైవసం

ఈ సందర్భంగా హోస్ట్‌ అడిగిన ప్రశ్నకు బదులిస్తూనే.. తొలి మాటలోనే ఇది నా చివరి ప్రపంచకప్‌ అని కోహ్లీ ప్రకటించాడు. కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసం నేను టీ 20 క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఇదే నా చివరి అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌ అని ప్రకటించడం చూస్తుంటే ఇకపై పొట్టి క్రికెట్‌లో కోహ్లీ కనిపించకపోవచ్చు. 

Also Read: T20 World Cup 2024 Live: వరల్డ్‌ కప్‌ లైవ్‌ అప్‌డేట్స్‌.. సాహో భారత్.. టీ 20 ప్రపంచకప్ మనదే

 

'ఇది నా చివరి టీ20 ప్రపంచ కప్‌. మేం సాధించాలనుకున్నది ఇదే. భారత్‌ తరఫున ఇదే నా చివరి టీ 20. నేను ఈ ప్రపంచ కప్‌గెలవాలని కోరుకున్నా. ఐసీసీ టోర్నమెంట్‌ను గెలవడానికి మేం చాలా కాలం వేచి ఎదురుచూశాం. రోహిత్‌ శర్మ 9 టీ20 ప్రపంచ కప్‌లు ఆడాడు. ఇది నాకు ఆరో ప్రపంచ కప్‌. ఈ ట్రోఫీకి రోహిత్‌ శర్మ అర్హుడు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ ఇది చాలా అద్భుతమైన రోజు' అని విరాట్‌ కోహ్లీ తెలిపాడు.

టీ20లో సుదీర్ఘ ప్రస్థానం
పొట్టి క్రికెట్‌లో 2010 జూన్‌లో విరాట్‌ కోహ్లీ అరంగేట్రం చేశాడు. 125 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 4,188 పరుగులు చేధాగు. ఇందులో ఒక శతకం, 38 అర్థ శతకాలు ఉన్నాయి. 2014, 106 టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌ అవార్డును కోహ్లీ అందుకున్నాడు. ఆఖరి అంతర్జాతీయ టీ20లోనూ కూడా కోహ్లీ అర్థ సెంచరీ సాధించడం విశేషం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News