BCCI appoints Rohit Sharma as India's T20I Captain: టీమిండియా టీ20 ఇంటర్నేషనల్ కేప్టేన్‌గా రోహిత్ శర్మ ప్రస్తుత కెప్టేన్ విరాట్ కోహ్లీ నుంచి పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోనున్నాడు. నవంబర్ 17న న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ నుంచే రోహిత్ శర్మ టీమిండియా పగ్గాలు తీసుకోనున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2021 (T20 World Cup 2021) ముగిసిన తర్వాత జట్టు కేప్టేన్సీ బాధ్యతల నుంచి తాను తప్పుకోనున్నట్టు విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రకటించిన నేపథ్యంలో అందరూ ఊహించినట్టుగానే (BCCI) రోహిత్ శర్మను టీ20 ఫార్మాట్‌కి జట్టు కేప్టేన్‌గా బీసీసీఐ నియమించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్ట్రేలియాలో జరగనున్న తర్వాతి టీ20 వరల్డ్ కప్ సమయానికి రోహిత్ శర్మ తన జట్టును పఠిష్టంగా తీర్చిదిద్దేందుకు తగిన సమయం, వీలు కలిగినట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో (T20 World cup 2021) టీమిండియా నాకౌట్ స్టేజ్‌కి కూడా వెళ్లకుండానే విఫలమైన నేపథ్యంలో రానున్న రోజుల్లో రోహిత్ శర్మ జట్టులో కొత్త వారికి అవకాశం లభించే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


Also read : India Vs Pakistan: భారత్- పాక్ మ్యాచ్​కు అదిరిపోయే 'వ్యూస్'.. టీ20 చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు..


టీ20 ఫార్మాట్ కేప్టేన్సీ రోహిత్ శర్మకు కొత్త కాదు. పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లోనే సక్సెస్‌ఫుల్ టోర్నమెంట్ అయిన ఐపిఎల్‌లో సక్సెస్‌ఫుల్ కేప్టేన్‌గా రోహిత్ శర్మ (BCCI appoints Rohit Sharma as T20I Captain) పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో నమిబియాపై హాఫ్ సెంచరీ చేసి క్యాంపెయిన్‌ని పాజిటివ్ నోట్‌తో ఎండ్ చేశాడు రోహిత్ శర్మ (Rohit Sharma latest updates). స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 16 బంతుల్లో 30 పరుగులు రాబట్టాడు.


Also read : PV Sindhu: డ్యాన్స్ తో అదరగొట్టిన పీవీ సింధు..నెట్టింట వైరల్ అవుతున్న వీడియో


Also read : Ravi shastri: టీమ్ ఇండియా కోచ్‌గా వైదొలగిన రవిశాస్త్రి, ఐసీసీపై ఆగ్రహం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి