Ravishastri: టీమ్ ఇండియాలో మార్పులు చోటుచేసుకున్నాయి. కోచ్‌గా రవిశాస్త్రిని తొలగించి..రాహుల్ ద్రావిడ్‌ను కొత్త కోచ్‌గా నియమించింది బీసీసీఐ. కోచ్ పదవి నుంచి వైదొలగిన అనంతరం రవిశాస్త్రి బీసీసీఐ వైఖరిపై ఆగ్రహం వెళ్లగక్కాడు.
టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీ నుంచి టీమ్ ఇండియా(Team india) గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. సెమీఫైనల్స్‌కు చేరకుండానే టీమ్ ఇండియా టోర్నీ నుంచి బయటికొచ్చేసింది. ఈ నేపధ్యంలో టీమ్ ఇండియాలో రెండు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కోచ్‌గా రవిశాస్త్రిని వైదొలిగాడు. అతని స్థానంలో కొత్త కోచ్‌గా రాహుల్ ద్రావిడ్‌ను(Rahul Dravid) నియమించింది బీసీసీఐ(BCCI). ఇటు టీ20 కెప్టెన్సీకు విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికాడు. కోచ్ పదవి నుంచి వైదొలగిన తరువాత రవిశాస్త్రి..బీసీసీఐ, ఐసీసీ వైఖరిపై ఆగ్రహం వెళ్లగక్కాడు. మెంటల్, ఫిజికల్ అలసటకు సంబంధించి రవిశాస్త్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
టీమ్ ఇండియా కోచ్ (Team india Coach)పదవి నుంచి వైదొలగిన రవిశాస్త్రి ఐసీసీతో(ICC) పాటు అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ రానున్న రోజుల్లో మానసిక అలసట విషయంలో ఐసీసీ లేదా ఇతర దేశాల క్రికెట్ బోర్డులు తగిన చర్యలు తీసుకోకపోతే క్రికెట్‌కు చాలా నష్టం కలుగుతుందని..తీవ్ర ప్రభావం పడుతుందని విచారం వ్యక్తం చేశాడు. లేకపోతే ఆటగాళ్లు త్వరగానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వెనక్కి వెళ్లిపోతారని ఆందోళన వ్యక్తం చేశాడు. గత ఆరు నెలలుగా తాము బయో బబుల్‌లో ఉంటున్నామని..టీ20 ప్రపంచకప్ కంటే ముందు విరామం ఉండి ఉంటే బాగుండేదని రవిశాస్త్రి(Ravishastri) అభిప్రాయపడ్డాడు. గత కొద్దికాలంగా బిజీ షెడ్యూల్‌తో ఉన్న టీమ్ ఇండియా గురించి ఆయన మాట్లాడారు. ఆటగాళ్లు కూడా మనుష్యులేనని..పెట్రోల్ ఆధారంగా నడవరని రవిశాస్త్రి తెలిపాడు. అన్నింటికంటే ముందు క్రీడాకారులకు విశ్రాంతి అవసరమన్నారు. మానసికంగా అలసిపోయున్నారని చెప్పాడు. ఓటమిని అంగీకరిస్తామని..ఓటమితో భయపడమని చెప్పిన రవిశాస్త్రి..తమలో ఎక్స్‌ఫ్యాక్టర్ లోపముందని చెప్పాడు.
అటు కెప్టెన్సీ పదవి వదిలిన అనంతరం విరాట్ కోహ్లీ (Virat Kohli)కూడా స్పందించాడు. తన గురించి టీమ్ ఇండియా గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు తనకు చాలా ప్రశాంతంగా ఉందని..గత 6-7 ఏళ్లలో ఎప్పుడు క్రికెట్ ఆడుతున్నా తీవ్రమైన ఒత్తిడి ఉండేదన్నాడు. తొలి రెండు మ్యాచ్‌లలో మొదటి రెండు ఓవర్లను జాగ్రత్తగా ఆడి ఉంటే ఫలితం వేరేగా ఉండేదన్నాడు. చివరిగా కోచ్ రవిశాస్త్రి, ఇతర జట్టు సభ్యులకు విరాట్ కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. అందరూ కష్టపడి ఆడారని..జట్టును ఏకత్రాటిపై నడిపించారని చెప్పుకొచ్చాడు. రవిశాస్త్రి టీమ్ ఇండియా కుటుంబంలో కీలకంగా ఉన్నారని..భారతీయ క్రికెట్‌కు అద్భుతమైన తోడ్పాటు అందించారని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.
Also read: IPL Mega Auction: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌లో ఎక్కువ ధర పలికే క్రికెటర్లు వీరే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook