IND vs PAK: ఆసియా కప్‌లో టీమిండియా విజయంపై భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) చీఫ్‌ సౌరభ్‌ గంగూలీ స్పందించారు. మెగా టోర్నీలో భారత్ శుభారంభం చేసిందన్నారు. కఠినమైన పరిస్థితుల్లో టీమిండియా ఆటగాళ్లు సంయమనంతో ఆడారని తెలిపారు. ఈమేరకు గంగూలీ ట్వీట్ చేశారు. దీనికి బీసీసీఐ రీట్వీట్ చేసింది. 2018లో పాక్ మ్యాచ్‌లో గాయపడి మైదానాన్ని వీడిన విషయాన్ని జడేజాతో హార్దిక్ చెబుతున్న వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనకు ఇప్పటికీ గుర్తుందని..2018 ఆసియా కప్‌లో పాక్ మ్యాచ్‌లో గాయపడ్డానని టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. స్ట్రెచర్‌పై తీసుకెళ్లడం తనకు ఇంకా గుర్తుందన్నాడు. మళ్లీ ఇప్పుడు తనకు అవకాశం వచ్చిందని..దానిని సద్వినియోగం చేసుకున్నానని చెప్పాడు. దీనికి సంబంధించిన పూర్తి వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు..విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. 


ఆసియా కప్‌లో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు, పాండ్య 3 వికెట్లు తీసి..పాక్‌ను దెబ్బతీశారు. లక్ష్య చేధనకు దిగిన టీమిండియా ఆచితూచి ఆడింది. 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. హార్దిక్ పాండ్యా సిక్సర్ బాది..జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో గత టీ20 వరల్డ్ కప్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. తర్వాతి మ్యాచ్ ఈనెల 31న హాంగ్‌కాంగ్‌తో భారత్ తలపడనుంది.




Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోమారు వర్ష సూచన..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!


Also read:Viral Video: వరద నీటిలో న్యూస్ రిపోర్టర్ మాక్‌లైవ్..వీడియో వైరల్..నెటిజన్ల ఫిదా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి