Team India : దక్షిణాఫ్రికాలో కరోనా విజృంభణతో టీమ్ ఇండియా పర్యటనపై అనుమానాలు
Indias cricket tour in jeopardy as South Africa likely to suspend all sports due to new COVID-19 variant: డిసెంబరు 17 నుంచి 2022 సంవత్సరం జనవరి 26 వరకు టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, 4 టీ20 మ్యాచులు ఆడనుంది.
BCCI concerned about India's tour of South Africa amid new COVID variant's rise: దక్షిణాఫ్రికాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో టీమ్ ఇండియా పర్యటనపై కాస్త సందిగ్ధం నెలకొంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వచ్చిన తర్వాతే.. దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారులతో చర్చిస్తామని బీసీసీఐ తెలిపింది. ఆ తర్వాతే టీమ్‌ఇండియా పర్యటనపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.
డిసెంబరు 17 నుంచి 2022 సంవత్సరం జనవరి 26 వరకు టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికాలో ( South Africa) పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, 4 టీ20 మ్యాచులు ఆడనుంది.
ప్రస్తుతం న్యూజిలాండ్‌తో (New Zealand) జరుగుతోన్న టెస్టు సిరీస్ పూర్తయిన తర్వాత డిసెంబరు 8న లేదంటే డిసెంబర్ 9న దక్షిణాఫ్రికా బయలు దేరాలని గతంలో నిర్ణయించామని బీసీసీఐ (BCCI) వర్గాలు తెలిపాయి. కానీ దక్షిణాఫ్రికాలో కరోనా విజృంభిస్తుండడంతో టీమ్‌ఇండియా పర్యటనపై సందిగ్ధం నెలకొందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న జొహన్నెస్ బర్గ్, సెంచూరియన్ సమీపంలోని ప్రిటోరియాల్లో ప్రాంతాల్లో కరోనా ఎక్కువగా ఉందని.. బీసీసీఐ (BCCI) పేర్కొంది.
Also Read : IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. టీమిండియాకు ధీటుగా కివీస్! తేలిపోయిన భారత బౌలర్లు!!
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమ్‌ఇండియా జట్టు ముంబై (Mumbai) నుంచి నేరుగా ఛార్టర్డ్ ఫ్లైట్‌లో జొహన్నెస్ బర్గ్ చేరుకున్నా కూడా.. తప్పనిసరిగా మూడు నుంచి నాలుగు రోజులు క్వారంటెయిన్‌లో ఉండాల్సి వస్తోందని బీసీసీఐ తెలిపింది. అందువల్ల మ్యాచ్‌ల నిర్వహణపై దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారిక వర్గాల నుంచి స్పష్టత వచ్చాకే.. టీమ్‌ఇండియా (Team India) పర్యటనపై తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.
Also Read : IND VS NZ 1st Test: సెంచరీతో చెలరేగిన శ్రేయస్..టీమిండియా 345 పరుగులకు ఆలౌట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి