IND VS NZ 1st Test: సెంచరీతో చెలరేగిన శ్రేయస్..టీమిండియా 345 పరుగులకు ఆలౌట్

IND VS NZ: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మెుదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 345 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ సెంచరీతో మెరిశాడు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ ఐదు వికెట్లు పడగొట్టాడు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 26, 2021, 01:30 PM IST
IND VS NZ 1st Test: సెంచరీతో చెలరేగిన శ్రేయస్..టీమిండియా 345 పరుగులకు ఆలౌట్

IND VS NZ 1st Test: కివీస్ తో జరుగుతున్న తొలి టెస్టు మెుదటి ఇన్నింగ్స్(IND VS NZ 1st Test Match)లో భారత యువ ఆటగాళ్లు అదరగొట్టారు. తొలుత శుభమన్ గిల్ అర్ధశతకంతో ఆకట్టుకోగా..అరంగ్రేటం బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) సెంచరీతో కదం తొక్కాడు. భారత తన తొలి ఇన్నింగ్స్ లో 345 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ(Tim Southee) 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. 

Also Read: IND vs NZ: ముగిసిన తొలిరోజు ఆట.. అర్ధ శతకాలతో ఆకట్టుకున్న అయ్యర్, జడేజా! భారత్ స్కోర్ ఎంతంటే?

శుక్రవారం రెండోరోజు 258/4తో ఆట ఆరంభించిన టీమిండియా ఆటగాళ్లకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రవీంద్ర జడేజా (50; 112 బంతుల్లో 6x4) తొలిరోజు స్కోర్‌ వద్దే ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అశ్విన్ (38; 56 బంతుల్లో 5x4) చూడచక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. వృద్ధిమాన్‌ సాహా (1), అక్షర్‌ పటేల్‌(3) తొందరగానే పెవిలియన్ బాట పట్టారు. ఇక భోజన విరామానికి ముందు అశ్విన్‌(Ashwin) కాస్త బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ 339/8తో తొలి సెషన్‌ను ముగించింది. భోజన విరామం అనంతరం అజాజ్‌ పటేల్‌ అశ్విన్‌, ఇషాంత్‌(0)ను ఔట్‌ చేయడంతో భారత ఇన్నింగ్స్‌కు 345 పరుగుల వద్ద ముగిసింది. . కివీస్‌ బౌలర్లలో టిమ్‌సౌథీ 5/69, కైల్‌ జేమీసన్‌ 3/91, అజాజ్‌ పటేల్‌ 2/90తో మంచి ప్రదర్శన చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News