IPL 2022 New Rules: ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభానికి ఎంతో సమయం లేదు. మరో నాలుగురోజుల్లో అట్టహాసంగా ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. ఈసారి ఐపీఎల్ గతంతో పోలిస్తే..కాస్త విభిన్నం. ఎలా ఉండబోతోంది, కొత్తగా వచ్చి చేరిన నిబంధనలేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2022లో ఈసారి లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు వచ్చి చేరాయి. మార్చ్ 26 నుంచి మొత్తం పది జట్లు టైటిల్ కోసం పోటీకి దిగనున్నాయి. కేఎల్ రాహుల్ సారధ్యంలో లక్నో సూపర్ జెయింట్స్, హార్దిక్ పాండ్యా నేతృత్వంలో గుజరాత్ టైటాన్స్ రంగంలో దిగుతున్నాయి. మార్చ్ 26వ తేదీన తొలి మ్యాచ్ ముంబై వాంఖడే స్డేడియంలో కేకేఆర్, సీఎస్కే జట్ల మధ్య జరగనుంది. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచేజీను 5 వేల 625 కోట్లకు కొనుగోలు చేయగా..లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 7 వేల 90 కోట్లకు అమ్ముడైంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన జట్టు ఇదే.


ఐపీఎల్ 2022లో మార్పులివే


ఈసారి పది జట్లు పాల్గొనడంతో ఐదేసి జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టు గ్రూపులోని మిగిలిన నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌ల చొప్పున 8 మ్యాచ్‌లుంటాయి. మిగిలిన ఆరు మ్యాచ్‌లను ఇతర గ్రూప్ జట్లతో ఆడాల్సి ఉంటుంది. ఇందులో ఒక జట్టుతో రెండు మ్యాచ్‌లుంటాయి. ఇక మెరీల్ బోర్న్ క్రికెట్ క్లబ్ చేసిన సూచనకు అనుగుణంగా..డీఆర్ఎస్ సంఖ్యను కూడా రెండుకు పెంచింది బీసీసీఐ. సూపర్ ఓవర్ నిబంధనల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. సూపర్ ఓవర్ సమయంలోగా నిర్ణయం కాకపోతే..లీగ్ పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును ప్లే ఆఫ్ మ్యాచ్ విజేతగా నిర్ణయిస్తారు. 


ఉల్లంఘిస్తే భారీ జరిమానా


ఇక బయోబబుల్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించనున్నారు. బయోబబుల్ నిబంధనల్ని ఆటగాడి కుటుంబసభ్యులు లేదా మ్యాచ్ అధికారి ఉల్లంఘిస్తే..వారిపై కూడా చర్యలుంటాయి. ఒక ఫ్రాంచైజీ బయటి వ్యక్తిని బయోబబుల్‌లో తీసుకొస్తే..కోటి రూపాయల వరకూ జరిమానా ఉంటుంది. కరోనా వైరస్ సంక్రమణ కారణంగా కొత్త నిబంధనలున్నాయి. ఒక జట్టు ప్లేయింగ్ 11 సిద్దం చేయలేకపోతే..మ్యాచ్ రీషెడ్యూల్ అవుతుంది. అప్పటికీ సిద్ధం కాకపోతే..టెక్నికల్ కమిటీకి రిఫర్ చేస్తారు. 


ఈసారి ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ భుజాలపై ఏ విధమైన సారధ్య బాధ్యతలు లేవు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆర్సీబీ జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఫాఫ్ డుప్లెసిస్ వ్యవహరించనున్నాడు.


Also read: IPL History: ఐపీఎల్‌లో ఇప్పటివరకూ అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..ఎవరెవరంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook