IPL History: ఐపీఎల్‌లో ఇప్పటివరకూ అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..ఎవరెవరంటే

IPL History: క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఆతృతతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022కు ఇంకా నాలుగు రోజులే మిగిలుంది. ఈ నేపధ్యంలో ఇప్పటివరకూ జరిగిన 14 ఐపీఎల్ సీజన్లలో ఎవరెవరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అత్యధికంగా అందుకున్నారో పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 22, 2022, 11:06 AM IST
 IPL History: ఐపీఎల్‌లో ఇప్పటివరకూ అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..ఎవరెవరంటే

IPL History: క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఆతృతతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022కు ఇంకా నాలుగు రోజులే మిగిలుంది. ఈ నేపధ్యంలో ఇప్పటివరకూ జరిగిన 14 ఐపీఎల్ సీజన్లలో ఎవరెవరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అత్యధికంగా అందుకున్నారో పరిశీలిద్దాం..

ఐపీఎల్ సీజన్ 15 మరో నాలుగురోజుల్లో ప్రారంభం కానుంది. మార్చ్ 26 నుంచి క్రికెట్ అభిమానుల్ని అలరించేందుకు మహారాష్ట్రంలోని ముంబై, పూణే నగరాల్లోని స్డేడియంలు సిద్ధమయ్యాయి. టీ 20 ఫార్మట్‌లో ఐపీఎల్ ఇప్పటివరకూ 14 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ 14 సీజన్లలో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఆటగాళ్లెవరో చూద్దాం.

ఐపీఎల్‌ చరిత్రలో  అత్యధికంగా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్లలో తొలిస్థానంలో నిలిచేది దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఏబీ డీవిలియర్స్‌. ఇప్పటివరకు ఏబీ డివిలియర్స్ 25 సార్లు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు అందుకున్నాడు. అంతేకాదు..ఐపీఎల్‌లో అన్నీ సీజ‌న్‌లలోనూ ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు మొత్తం 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీ డీవిలియర్స్..5 వేల 162 పరుగులు చేశాడు. ఇతడి సగటు 39గా ఉంది. ఇందులో మూడు సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 133 పరుగులు.

ఇక ఐపీఎల్‌‌లో అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌‌లు అందుకున్న రెండవ ఆటగాడు వెస్టిండీస్‌‌కు చెందిన విధ్వంసకర బ్యాటర్ క్రిస్‌గేల్. గేల్ 22 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు తీసుకున్నాడు. మూడవ స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ 18 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. నాలుగవ స్థానంలో మాత్రం ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు. డేవిడ్ వార్నర్, మహేంద్ర సింగ్ ధోనీ ఇద్దరూ 17 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నారు. ఆ తరువాతి స్థానాల్లో యూసఫ్‌ పఠాన్‌, షేన్‌ వాట్సన్‌, సురేష్‌ రైనా, విరాట్‌ కోహ్లీ, రహానే ఉన్నారు.

Also read: INDW vs BANW: బ్యాటింగ్‌లో తడబడిన భారత్.. బంగ్లాదేశ్‌కు ఈజీ టార్గెట్! గెలిస్తేనే మిథాలీ సేన నిలిచేది!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News