Covid-19: రిషబ్ పంత్‌కు అండగా నిలిచిన బీసీసీఐ అధ్యక్షుడు Sourav Ganguly
BCCI President Sourav Ganguly: విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా జట్టు ఆగస్టు మొదటి వారం నుంచి టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో యువ ఆటగాడు రిషబ్ పంత్ కరోనా డెల్టా వేరియంట్ బారిన పడ్డాడు.
Rishabh Pant tests Covid-19 positive: టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు(BCCI) సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఆటగాళ్లకు నిబంధనలు మారాయని, ఇంగ్లాండ్‌లో స్టేడియాలకు వీక్షకులను అనుమతి ఇస్తున్నారని గుర్తుచేశారు. నిత్యం మాస్కులు ధరించడం చాలా కష్టమని, పంత్ విషయంలోనూ ఇదే జరిగి ఉంటుందన్నారు.
విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా జట్టు ఆగస్టు మొదటి వారం నుంచి టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో యువ ఆటగాడు రిషబ్ పంత్ కరోనా డెల్టా వేరియంట్ బారిన పడ్డాడు. అతడు యూరో కప్ మ్యాచ్‌కు మాస్కు ధరించకుండా వెళ్లాడని, అతడి కారణంగా ఇతర ఆటగాళ్లకు సైతం కరోనా సోకే అవకాశం ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. పంత్ కరోనా బారి నుంచి కోలుకుంటున్నాడని, ఇతర ఆటగాళ్లకు కరోనా నెగటివ్ అని ఫలితాలలో తేలిందన్నారు.
Also Read: COVID-19: రిషబ్ పంత్‌కు కరోనా పాజిటివ్, డెల్టా వేరియంట్‌ను గుర్తించిన వైద్యులు
వింబుల్డన్ టోర్నమెంట్, యూరో కప్ లాంటి మ్యాచ్‌లు ఇంగ్లాండ్‌లో నిర్వహించారు. స్టేడియాలకు వీక్షకులను అనుమతిస్తున్నారు. ఆటగాళ్లు సైతం రోజంతా మాస్కులు ధరించడం వీలుకాదని, పంత్ త్వరగా కోలుకుంటున్నాడని చెప్పారు. ఆదివారం నిర్వహించే కోవిడ్19 టెస్టుల్లో వచ్చే ఫలితంతో పంత్ ఎంత త్వరగా జట్టుతో చేరతాడన్నది ఆధారపడి ఉంటుందన్నారు. పంత్‌ను తప్పుపట్టకుండా యువ క్రికెటర్‌కు గంగూలీ అండగా నిలిచారు.
Also Read: T20 World Cup 2021: Shikhar Dhawan కంటే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌కే ఎక్కువ ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook