BCCI: సౌరవ్ గంగూలీ దాదాగిరి ముగిసిందా?
ఆటగాడిగా, కెప్టెన్‌గా విశేష సేవలందించిన సౌరవ్ గంగూలీ (Sourav Ganguly).. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడి (BCCI President)గా కీలక పదవిని సైతం అలంకరించాడు.
భారత క్రికెట్‌కు ప్రత్యక్షంగా ఆటగాడిగా, కెప్టెన్‌గా విశేష సేవలందించిన సౌరవ్ గంగూలీ (Sourav Ganguly).. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడిగా కీలక పదవిని సైతం అలంకరించాడు. అయితే కేవలం 9 నెలల వ్యవధిలోనే గంగూలీ ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి మూడేళ్లపాటు బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగేందుకు గంగూలీ (BCCI President Sourav Ganguly)ని ఎంపిక చేశారు. కానీ జస్టిస్ లోధా కమిటీ నిబంధనల ప్రకారం జులై 27తో గంగూలీ పదవికాలం ముగిసినట్లయింది. BCCI అవమానించినా ఆశ్చర్యపోలేదు: Yuvraj Singh
గంగూలీతో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా పరిస్థితి అదే తీరుగా ఉంది. బోర్డును గాడిలో పెట్టేందుకు సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోధా కమిటీ కమిటీ చేసిన సిఫారసులు చేసింది. వీటి ప్రకారం బీసీసీఐలోగానీ దాని అనుబంధ రాష్ట్ర క్రికెట్ సంఘాలలోగానీ ఏ వ్యక్తి అయినా గరిష్టంగా ఆరేళ్లపాటు మాత్రమే పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. ఒకవేళ 6ఏళ్ల పదవిలో ఉంటే బాధ్యతల నుంచి తప్పుకుని మూడేళ్ల పాటు పదవులకు దూరంగా ఉండాలి. మూడేళ్ల తప్పనిసరి విరామం (కూలింగ్ పీరియడ్) అనంతరం మళ్లీ బోర్డులో పదవులు చేపట్టేలా జస్టిస్ లోధా కమిటీ కొన్ని సూచనలు చేసింది. త్వరలో తేలనున్న గంగూలీ భవితవ్యం.. IPL టైమ్‌లో చిక్కులు
అడ్డంకిగా మారిన నిబంధనలు
బీసీసీఐలో సంక్షోభం రాకుండా, బోర్డును గాడిలో పెట్టేందుకు లోధా కమిటీ చేసిన సిఫారసులకు 2018 ఆగస్టులో సుప్రీంకోర్టు దీనికి ఆమోద ముద్ర వేసింది. ఇదే గంగూలీ, జై షాలకు అడ్డంకిగా మారింది. బీసీసీఐలో పదవి చేపట్టక ముందు గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌లో అయిదేళ్లకు పైగా పదవిలో ఉన్నాడు. మరో వైపు గుజరాత్ క్రికెట్ సంఘంలో పదవిలో కొనసాగాడు. తాజాగా వీరి ఆరేళ్ల పదవీకాలం పూర్తి కావడంతో పదవుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. IPL 2020 తర్వాత ధోనీ రీఎంట్రీ ఫిక్స్!
స్పష్టతకు రెండు వారాలు!
తమ పదవీకాలం ముగిసేవరకు పదవిలో కొనసాగేలా అనుమతినివ్వాలంటూ గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ టీమ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు వాయిదా వేసింది. పిటిషన్‌పై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఏస్ఏ బాబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ద్విసభ్య బెంచ్ విచారణను 2 వారాలపాటు వాయివేసింది. ఆగస్టు రెండో వారంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే గంగూలీ, జై షా పదవిలో కొనసాగాలా లేక రాజీనామా చేయాలన్నదానిపై స్పష్టత రానుంది. పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్