ఏడాదికి పైగా జట్టుకు దూరమైన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) త్వరలోనే భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తాడని ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ధోనీ కెరీర్‌పై సందిగ్దత నెలకొంది. గతేడాది వన్డే ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ ఓటమి తర్వాత ధోనీ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆరు నెలల కిందట బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఎంఎస్ ధోనీ పేరును తప్పించడం తెలిసిందే. IPL 2020: ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడో తెలుసా?
ధోనీ రీఎంట్రీ (MS Dhoni ReEntry) సహా పలు అంశాలను డీన్ జోన్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో షేర్ చేసుకున్నాడు. ‘త్వరలో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ అంటే గుర్తొచ్చేది చెన్నై జట్టు. ధోనీ మరోసారి ఐపీఎల్‌లో సత్తాచాటి భారత జట్టులోకి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇస్తాడు. ఇదే అతడికి కలిసొచ్చే అంశం. జట్టులోకి రావడానికి ప్రాక్టీస్ చేసినా భారత్ ఆడిన చివరి సిరీస్‌లో చోటు దక్కలేదు. RCB Trolls: ఈసారి కప్పు మనదే.. ఆర్సీబీని ఆటాడుకుంటున్న నెటిజన్లు
ప్రస్తుతానికి ధోనీకి బదులుగా యువ కీపర్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లను జట్టులోకి తీసుకున్నారు. అయితే ధోనీ లాంటి ఆటగాడు జట్టుకు మేటి ఫినిషర్ అని గుర్తుంచుకోవాలి. ధోనీ అద్భుత ఆటగాడు. ఐపీఎల్ అతడికి మేలు చేస్తుంది. నా దృష్టిలో ధోనీ ఎప్పటికీ గొప్ప క్రికెటర్. ఆటలో అతడు సూపర్ స్టార్. త్వరలోనే మంచి బ్రేక్‌తో భారత జట్టులోకి వచ్చేందుకు తలుపులు తెరుచుకుంటాయని’ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు. బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..