BCCI president Sourav Ganguly's daughter Sana Ganguly tests positive for COVID-19: టీమిండియా (Team India) మాజీ కెప్టెన్, ప్రస్తుత భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఫ్యామిలీలో కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన గంగూలీ ఇటీవలే డిశ్చార్జ్ కాగా.. తాజాగా దాదా కూతురు సనా గంగూలీ (Sana Ganguly)కి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే సనాకు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉండడంతో.. ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్ అయ్యారట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోల్‌కతాలోని వుడ్‌లాండ్స్‌ ఆసుపత్రిలో కరోనా నుంచి కోలుకున్న సౌరవ్ గంగూలీ గత శుక్రవారం ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. గంగూలీకి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకడంతో ఇంట్లోనే ఆయనకు వైద్యం అందిస్తున్నారు.


అయితే తనకు కరోనా లక్షణాలు ఉండడంతో దాదా కూతురు (Sourav Ganguly Daughter) సనా గంగూలీ బుధవారం (జనవరి 5) టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తేలికపాటి లక్షణాలు ఉండడంతో సనా ఇంట్లోనే ఐసోలేషన్ అయ్యారు. వుడ్‌లాండ్స్‌ ఆసుపత్రి వైద్య బృందమే సనాకు చికిత్స అందిస్తుందని సమాచారం. 


Also Read: Same Sex Marriage: పెళ్లితో ఒక్కటి కానున్న ఇద్దరు మహిళా వైద్యులు...


సనా గంగూలీతో పాటుగా దాదా కుటుంబం (Sourav Ganguly Family)లో మరో ముగ్గురికి కూడా వైరస్ సోకిందని సమాచారం తెలుస్తోంది. సౌరవ్ గంగూలీ మామ దేబాశిష్ గంగూలీ, కజిన్ షువ్రోదీప్ గంగూలీ మరియు వదిన జాస్మిన్ గంగూలీకి కూడా పాజిటివ్ వచ్చిందని సమాచారం.


అయితే అందరికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయట. వరుసగా అందరూ వైరస్ బారిన పడుతుండడంతో దాదా ఫ్యామిలీ ఆందోళన చెందుతుందట. గతంలో దాదా కుటుంబ సభ్యులు వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే. 


మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) భారత్ (India) తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 7212 పరుగులు, వన్డేల్లో 11363 రన్స్ చేశారు. మొత్తంగా 38 అంతర్జాతీయ సెంచరీలు చేశారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)‌లోనూ 59 మ్యాచ్‌లాడిన గంగూలీ.. 106.81 స్ట్రైక్‌రేట్‌తో 1349 పరుగులు చేశారు. బౌలర్‌గానూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 132 వికెట్లు, ఐపీఎల్‌ టోర్నీలో 10 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. మీడియం పేస్ బౌలింగ్‌తో దాదా ఆకట్టుకున్నారు.


Also Read: Man rapes dog: శునకంపై వృద్దుడి లైంగిక దాడి.. సీక్రెట్‌గా వీడియో తీసిన కోడలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి