IPL 2022 Schedule: క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్, ఐపీఎల్ 2022 షెడ్యూల్ విడుదల, తొలి మ్యాచ్ ఎవరిదంటే
IPL 2022 Schedule: యావత్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 షెడ్యూల్ విడుదలైంది. ఐపీఎల్ 15వ సీజన్ మార్చ్ 26న ప్రారంభం కానుండగా..తొలి మ్యాచ్ ఐపీఎల్ 14 విన్నర్, రన్నర్‌ల మధ్య జరగనుంది.
IPL 2022 Schedule: యావత్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 షెడ్యూల్ విడుదలైంది. ఐపీఎల్ 15వ సీజన్ మార్చ్ 26న ప్రారంభం కానుండగా..తొలి మ్యాచ్ ఐపీఎల్ 14 విన్నర్, రన్నర్‌ల మధ్య జరగనుంది.
క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఐపీఎల్ 2022 షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లు ముంబై, పూణే నగరాల్లో 65 రోజులపాటు జరగనున్నాయి. మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు కాగా, 4 ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉన్నాయి. మార్చ్ 26 నుంచి ప్రారంభమై..మే 29 వరకూ జరగనున్నాయి. తొలి మ్యాచ్ వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. లీగ్ దశలోని చివరి మ్యాచ్ మే 22వ తేదీన ఇదే స్డేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య ఉంటుంది. మే 29వ తేదీన ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ప్లే ఆఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రం ఇంకా విడుదల కాలేదు.
[[{"fid":"223935","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"BCCI Releases ipl 2022 schedule","field_file_image_title_text[und][0][value]":"ఐపీఎల్ 2022 షెడ్యూల్ విడుదల"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"BCCI Releases ipl 2022 schedule","field_file_image_title_text[und][0][value]":"ఐపీఎల్ 2022 షెడ్యూల్ విడుదల"}},"link_text":false,"attributes":{"alt":"BCCI Releases ipl 2022 schedule","title":"ఐపీఎల్ 2022 షెడ్యూల్ విడుదల","class":"media-element file-default","data-delta":"1"}}]]
ఇక ఒకరోజు రెండు మ్యాచ్‌లు ఉన్నప్పుడు మాత్రం తొలి మ్యాచ్ మద్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు, రెండవ మ్యాచ్ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. నాకౌట్ మ్యాచ్‌లు మాత్రం అహ్మదాబాద్ వేదికగా జరగవచ్చు.
Also read: IND vs SL: జడేజా సూపర్ షో.. తొలి టెస్టులో భారత్ ఘన విజయం! విరాట్ కోహ్లీకి స్పెషల్ గిఫ్ట్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook