T20 World Cup 2024: ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో ఇండియా తడబడటంతో పాటు కప్ చేజార్చుకోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. ఇక కెప్టెన్సీ ఉండదనే వార్తలు విన్పించాయి. ముఖ్యంగా త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్ నేతృత్వం ఎవరికి లభిస్తుందనే చర్చ సాగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమ్ ఇండియాను కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల జరిగిన ప్రపంచకప్ 2023లో అద్భుతంగా నడిపించాడు. ఫైనల్ వరకూ ఒక్క ఓటమి లేకుండా జట్టును అగ్రస్థానంలో నిలిపాడు. ఫైనల్స్‌లో ఓడిపోయేసరికి రోహిత్ సహా చాలామంది నిరాశలో ఉండిపోయారు. కొంతమందైతే అప్పటివరకూ అందించిన విజయాల్ని మర్చిపోయి రోహిత్‌ను ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు. ఈ క్రమంలో రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తారనే ప్రచారం కూడా సాగింది. ఇప్పుడీ ప్రచారానికి దాదాపుగా తెరపడినట్టే. రోహిత్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త అందించినట్టే. రానున్న టీ20 ప్రపంచకప్ బాధ్యతలు కూడా రోహిత్ శర్మకే అప్పగించే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. 


టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగిసిన తరుణంలో బీసీసీఐ ఏర్పాటు చేసిన సమావేశంలో రోహిత్, విరాట్ కోహ్లిపై రాహుల్ ద్రావిడ్ అభిప్రాయం అడిగింది. ఈ ఇద్దరి రిటైర్మెంట్ ఉంటుందా లేదా, ఇద్దరి సేవలు ఇంకా అవసరమా, రెండేళ్ల ప్రయాణంలో ఆ ఇద్దరిపై రాహుల్ అభిప్రాయమేంటనే వివరాలపై చర్చించింది రోహిత్ శర్మ కెప్టెన్సీపై అద్భుతంగా ఉండటం వల్లనే ప్రపంచకప్‌లో ఇండియా అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించి ఫైనల్ వరకూ వెళ్లింది. అదే సమయంలో ఓపెనర్‌గా ప్రతి మ్యాచ్‌లో మంచి ఆరంభం ఇచ్చేవాడు. అంటే అటు కెప్టెన్‌గా ఇటు బ్యాటర్‌గా విఫలం కాలేదు. అటు విరాట్ కోహ్లీ సైతం ఈ ప్రపంచకప్‌లో 765 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అందుకే ఈ ఇద్దరి కెరీర్‌పై అటు ద్రావిడ్‌కు గానీ ఇటు బీసీసీఐకు గానీ ఎలాంటి సందేహాల్లేవు.


ప్రపంచకప్ ఫైనల్ ఓటమి అనంతరం రోహిత్ శర్మ డిప్రెషన్‌లో వెళ్లాడా, వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ సారధ్యం వహించగలడా అనే అంశాల్ని చర్చించిన బీసీసీఐ రాహుల్ ద్రావిడ్ అభిప్రాయాలు కూడా తీసుకుంది. దాంతో రానున్న టీ20 ప్రపంచకప్‌కు కూడా కెప్టెన్ బాధ్యతలు రోహిత్ శర్మకే అప్పగించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే బీసీసీఐ రోహిత్ శర్మతో ఈ విషయమై మాట్లాడినట్టు సమాచారం. టీ20 ప్రపంచకప్‌కు ఇండియాను సిద్ధం చేయాలని కోరినట్టు తెలుస్తోంది. బీసీసీఐకు కూడా మరో ఆలోచన లేనట్టు సమాచారం. అంటే ఇక ముందు కూడా టీమ్ ఇండియాకు నేతృత్వం వహించేది రోహిత్ శర్మనే.


Also read: India vs Australia Highlights: మ్యాక్స్‌వెల్ తుఫాన్ ఇన్నింగ్స్.. భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook