న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) లో భాగంగా ఆటగాళ్లకు కరోనా వైరస్ టెస్టులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాళ్లు, సిబ్బందికి కలిపి 13 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. టోర్నీ పూర్తయ్యేసరికి మొత్తం 20 వేల కోవిడ్19 టెస్టులు జరపనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చెబుతోంది. ఆర్‌టీ పీసీఆర్ టెస్టుల నిమిత్తం మొత్తం రూ.10 కోట్ల వరకు వెచ్చించనున్నట్లు సమాచారం. COVID19: యాంటీ బాడీస్ డొనేట్ చేసిన కీరవాణి 
 Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూఏఈకి చెందిన కంపెనీని ఐపీఎల్ ఆటగాళ్లు, సిబ్బందికి కోవిడ్ టెస్టులు నిర్వహణ నిమిత్తం 75 మందిని తీసుకున్నారు. వీరు ఆటగాళ్లకు షెడ్యూల్ ప్రకారం ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నారు. సీజన్ పూర్తయ్యేసరికి ఆటగాళ్ల కోవిడ్ నిర్ధారణ టెస్టుల నిమిత్తం బీసీసీఐ రూ.10 కోట్ల మేర ఖర్చు చేయనున్నట్లు సీనియర్ ఐపీఎల్ అధికారి పీటీఐకి తెలిపారు. CSK ఆటగాళ్లను వెంటాడుతోన్న కరోనా భయం 
‘Sourav Ganguly టీ20లకు పనికిరాడని ముందే ఊహించా’


ఆగస్టు 20 నుంచి 28 మధ్య కాలంలో దాదాపు 2 వేల కరోనా టెస్టులు నిర్వహించారని వెల్లడించారు. ఆటగాళ్ల ఆరోగ్యంపై బీసీసీఐ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లకు ఏమీ కాకుండా చూసుకుంటామని చెప్పిన క్రమంలోనే ఐపీఎల్ నిర్వాహక మండలికి ఈ ఏడాది సీజన్ నిర్వహించేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. Photos: ఘనంగా గౌతమ్ పుట్టినరోజు వేడుక 
Khatron Ke Khiladi టైటిల్ విన్నర్, నటి నియా శర్మ ఫొటో గ్యాలరీ