Ben Stokes Falls: క్రీజులోనే కుప్పకూలిన బెన్ స్టోక్స్.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
Ben Stokes Falls after short delivery hits. కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022లో డర్హామ్ జట్టు తరఫున ఆడుతున్న ఇంగ్లండ్ కొత్త టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయపడ్డాడు.
Ben Stokes floored after Marnus Labuschagne short delivery hits: క్రికెట్ బంతి తగిలి తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణించిన విషయం తెలిసిందే. 2014 నవంబర్ మాసంలో సీన్ అబోట్ వేసిన బంతి హెల్మెట్ పెట్టుకున్న హ్యూస్ తలకు బలంగా తాకడంతో అతడు మరణించాడు. ఆ తర్వాత చాలా మంది క్రికెటర్లకు బంతి తాకినా.. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ కూడా భారీ బౌన్సర్‌కు గాయపడి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022లో డర్హామ్ జట్టు తరఫున ఆడుతున్న ఇంగ్లండ్ కొత్త టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయపడ్డాడు. గ్లామోర్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 110 బంతుల్లో ఎనిమిది ఫోర్లు మరియు రెండు సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేశాడు. అయితే 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బ్యాటింగ్ చేస్తున్నపుడు స్టోక్స్ పొత్తి కడుపులో బంతి బలంగా తాకింది. మార్నస్ లబూషేన్ షార్ట్ పిచ్ బంతి వేయగా.. అనుకున్నంత ఎత్తులో రాలేదు. ఆ బంతిని సరిగ్గా అంచనా వేయలేని స్టోక్స్.. లెగ్ సైడ్ భారీ షాట్ ఆడడానికి ట్రై చేశాడు.
నడము ఎత్తులోకి వచ్చిన బంతి బ్యాట్‌కు సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో.. బెన్ స్టోక్స్ పొత్తి కడుపులో బలంగా తాకింది. వెంటనే స్టోక్స్ క్రీజులో పడిపోయాడు. కాసేపు వెల్లకిలా పడుకుండిపోయాడు. కిందపడినా కూడా మార్నస్ లబూషేన్ అతడి వద్దకు రాకుండా అలానే వెళ్లిపోయాడు. స్టోక్స్‌కు ఏమైందోనని అనుకునే లోపే లేచినిలబడ్డాడు. కాసేపు అటుఇటు తిరిగిన అతడు మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలో స్టోక్స్ భారీ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే బంతి కాస్త పైకి తాకితే భారీ ముప్పు వాటిల్లేది.
కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022లో బెన్ స్టోక్స్ అద్భుత ఫామ్ కనబర్చుతున్నాడు. వోర్సెస్టర్‌షైర్‌పై కేవలం 88 బంతుల్లో 161పరుగులు చేసిన స్టోక్స్.. తాజాగా గ్లామోర్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 82 రన్స్ చేశాడు. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ త్వరలోనే జరగనున్న తరుణంలో అతను ఫామ్ అందుకోవడం సంతోషించాల్సిన విషయం. ఇక ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా జో రూట్ వైదొలిగిన తర్వాత స్టోక్స్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. పూర్తిస్థాయి కెప్టెన్‌గా స్టోక్స్‌కు ఇది తొలి టెస్ట్ సిరీస్.
Also Read: Pat Cummins IPL: ఐపీఎల్ నుంచి కోల్‌కతా పేసర్ పాట్ కమిన్స్ ఔట్.. కారణం ఇదే!
Also Read: SVP First Day Collections: బాక్సాఫీస్‌పై మహేశ్ బాబు దండయాత్ర.. తొలిరోజు రికార్డు కలెక్షన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook