Ben Stokes`s apology : అభిమానికి క్షమాపణలు చెప్పిన క్రికెటర్
ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా జట్ల మధ్య చివరిదైన 4వ టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట సందర్భంగా మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన ఓ అభిమానితో ఇంగ్లండ్ ఆల్-రౌండర్ బెన్ స్టోక్స్ ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన ఓ క్రికెట్ ఫ్యాన్.. బెన్ స్టోక్స్ ఔట్ అయిన అనంతరం అతడిపై ఏవో దురుసు వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా జట్ల మధ్య చివరిదైన 4వ టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట సందర్భంగా మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన ఓ అభిమానితో ఇంగ్లండ్ ఆల్-రౌండర్ బెన్ స్టోక్స్ ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన ఓ క్రికెట్ ఫ్యాన్.. బెన్ స్టోక్స్ ఔట్ అయిన అనంతరం అతడిపై ఏవో దురుసు వ్యాఖ్యలు చేశాడు. అయితే, అది జీర్ణించుకోలేని బెన్ స్టోక్స్ కూడా అంతే దురుసుగా స్పందిస్తూ అతడిపై దుర్భాషలాడాడు. ఆవేశంతో సహనం కోల్పోయిన బెన్ స్టోక్స్ అభిమానిపై ఒకింత అసభ్య పదజాలం వినియోగించాడు. ఆ దృశ్యాలన్నీ అప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం కానప్పటికీ.. ఆ తర్వాత ఆ దృశ్యాలన్నీ టీవీలో ప్రసారం అవడమే కాకుండా సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. దీంతో తన నోటిదురుసుతనంపై బెన్ స్టోక్స్‌కి క్లారిటీ ఇవ్వకతప్పలేదు. తన నోటి దురుసుతనంపై ఆలస్యంగా మేల్కొన్న స్టోక్స్.. ఆ సమయంలో తాను అంత దురుసుగా ప్రవర్తించాల్సింది కాదంటూ వివరణ ఇచ్చుకున్నాడు. ట్విటర్ ద్వారా అభిమానికి క్షమాపణలు చెప్పిన స్టోక్స్.. ఏదేమైనా తనది తప్పేనని అంగీకరించాడు.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పాల్గొనే ఆటగాళ్లు ఒకరికి వినిపించేంత బిగ్గరగా నోరుపారేసుకోవడం లెవెల్ 1 అఫెన్స్ (ప్రథమ స్థాయి నేరం) అవుతుంది. లెవెల్ 1 స్థాయి నేరానికి పాల్పడిన వారికి 50 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్స్‌తో ఇచ్చే అవకాశం ఉంది. దీంతో బెన్ స్టోక్స్ విషయంలో ఐసిసి ఎలా స్పందించనుందనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.