Water Crisis for IPL matches: ఇప్పటికే దేశంలో ఐపీఎల్ ఫీవర్ మెుదలైంది. మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 17వ సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి పోరులో చెన్నై, బెంగళూరు జట్లు తలపడబోతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఐపీఎల్ మ్యాచులకు నీటి కష్టాలు తప్పేలా లేవు. బెంగళూరు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కోంటుంది. గతేడాది వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో.. అక్కడ ప్రజలు నీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత తీవ్ర నీటి ఎద్దడి ఉన్న సమయంలో నగరంలోని ఎమ్. చిన్నస్వామి స్టేడియంలో మార్చి 25, 29 మరియు ఏప్రిల్ 2 తేదీల్లో ఐపీఎల్ మ్యాచులు జరగబోతున్నాయి. ఈ మ్యాచులకు నీటిని ఎలా సరఫరా చేయాలనే విషయంపై నిర్వాహకులు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కో మ్యాచ్‌కు కనీసం 75 వేల లీటర్ల నీరు అవసరం పడే అవకాశం ఉంది. నీటి కొరత తీవ్రంగా ఉన్న ఈ సమయంలో అంత ఇంత నీటిని సరఫరా చేయాలంటే అధికారులకు కత్తి మీద సామే. 


ఐపీఎల్ మ్యాచులకు నీటి సరఫరాపై కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (Karnataka State Cricket Association (KSCA) మేనేజ్‌మెంట్ బోర్డు అభ్యర్థన మేరకు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు(బీడబ్ల్యూఎస్ఎస్బీ) కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి దృష్ట్యా,  చిన్నస్వామి స్టేడియంకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నీటిని కబ్బన్‌ పార్క్‌ వేస్ట్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (Cubbon Park wastewater treatment plant) నుంచి తీసుకోనున్నారు.


Also Read: SRH New Anthem: దుమ్మురేపుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌ కొత్త సాంగ్.. వైరల్ అవుతున్న వీడియో..


కేఎస్‌సీఏ యొక్క విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన బీడబ్ల్యూఎస్ఎస్బీ ఛైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ స్టేడియంకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. అంతేకాకుండా తాము శుద్ధి చేసిన నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నామని.. కావేరీ నది, భూగర్భ జలాలను దుర్వినియోగం చేయడం లేదని ఆయన అన్నారు. వర్షాలు కురవకపోవడం, భూగర్భజలాలు క్షీణించడం బెంగళూరు నీటి కష్టాలకు కారణం. 


Also Read: IPL 2024: ఐపీఎల్ వేటకు సిద్ధం.. సొంత జట్లకు తిరిగి వచ్చిన ఆటగాళ్లు వీళ్లే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook