Big Bash Tournament: ఒకటే బంతికి ఏకంగా 16 పరుగులు, ఎలా సాధ్యమైందంటే
Big Bash Tournament: క్రికెట్లో చాలా సందర్భాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఊహించని క్యాచ్‌లు చేతపట్టడమే కాకుండా విన్యాసాలు చేస్తుంటారు. ఒక బంతికి ఏకంగా 16 పరుగులు సాధించి కొత్త రికార్డు నమోదు చేశాడు ఆ బ్యాటర్.
ఆశ్చర్యంగా ఉందా. కానీ నిజమే ఇది. ఒక బంతికి 6 పరుగులు రావడమే కష్టం. అదే గరిష్టం కూడా. మరి 16 పరుగులు ఎలా సాధ్యమనుకుంటున్నారా..ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్‌బాష్ టోర్నమెంట్ ఇందుకు సాక్ష్యం. ఆ వివరాలు మీ కోసం.
ఇండియాలో ఐపీఎల్ తరహా ఆదరణ పొందిన టోర్నమెంట్ ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ ఓ విచిత్రం చోటుచేసుకుంది. ఇది విచిత్రమే కాదు క్రికెట్ చరిత్రలో ఓ రికార్డు కూడా. ఒక బంతికి 16 పరుగుల సాధించిన ఘనత దక్కించుకున్నాడు. స్టీవెన్ స్మిత్. ఆస్ట్రేలియలోని హోల్డర్‌లో సిడ్నీ సిక్సర్స్ వర్సెస్ హోబర్ట్ హరికేన్స్ మ్యాచ్‌లో జరిగిన అద్భుతమిది.
సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్న స్టీవెన్ స్మిత్ సాధించిన ఫీట్ ఇది.హోబర్ట్ హరికేన్స్ బౌలర్ జోయెల్ పారిస్ మ్యాచ్ రెండవ ఓవర్ చేశాడు. తొలి రెండు బాల్స్ డాట్ బాల్స్‌గా మిగిలాయి. పారిస్ వేసిన మూడవ బంతిని స్మిత్ సిక్సర్‌గా మలిచాడు. అంపైర్ దీనిని నో బాల్‌గా ప్రకటించాడు. దాంతో ఏడు పరుగులు లభ్యమయ్యాయి. ఇక ఫ్రీ హిట్ మిగిలింది. ఫ్రీ హిట్ బాల్ కాస్తా వైడ్‌గా మారి కీపర్‌ను దాటి బౌండరీకు వెళ్లిపోయింది. దాంతో మరో ఐదు పరుగులు వచ్చి చేరాయి. అంటే మొత్తం 12 పరుగులు. ఇక ఫ్రీ హిట్ బాల్‌కు బౌండరీ సాధించడంతో 16 పరుగులు వచ్చి చేరాయి. క్రికెట్ చరిత్రలో ఇదొక రికార్డుగా మారింది.
ఈ మ్యాచ్‌లో స్టీవెన్ స్మిత్ 33 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. నిర్ణీత 20 ఓవర్లలో సిడ్నీ సిక్సర్స్ టీమ్ 180 పరుగులు చేసింది. ఇక ప్రత్యర్ధి జట్టు హోబర్ట్ హరికేన్స్ 156 పరుగులే చేయగలిగింది. వాస్తవానికి స్టీవెన్ స్మిత్‌ను ఈ టోర్నీలో బ్యాటర్‌గా గుర్తించలేదు. కానీ అద్భుతంగా చెలరేగి ఆడుతున్నాడు. సిడ్నీ థండర్స్‌పై సైతం సెంచరీ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అటు ఆడిలైడ్ స్ట్రైకర్స్‌పై కూడా శతకం నమోదు చేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook