ICC Champions Trophy 2025: ఐసీసీ ట్రోఫీల్లో వన్డే ప్రపంకప్ తరువాత అంతటి క్రేజ్ ఉన్నది ఛాంపియన్స్ ట్రోఫీకు. 2025లో జరగనున్న ఈ ట్రోఫీకు ఆతిధ్యం ఇవ్వాల్సిన పాకిస్తాన్‌కు ఆటంకాలు ఎదురౌతున్నాయి. ఇప్పటికే ఇండియా రూపంలో అడ్డంకులు ఎదురౌతుంటే కొత్తగా ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఎంట్రీ ఇవ్వడంతో పాకిస్తాన్‌కు మరో షాక్ తగలనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకారం 2025లో పాకిస్తాన్ ఆతిధ్యం ఇవ్వాల్సి ఉంది. పాకిస్తాన్ ఆతిధ్యం ఇవ్వనున్నట్టు ఐసీసీ బహిరంగంగా ప్రకటించింది కూడా. అయితే అధికారికంగా హోస్టింగ్ అగ్రిమెంట్ ఇంకా జరగలేదు. ఈ క్రమంలో టీమ్ ఇండియా నుంచి పాకిస్తాన్ ఇవ్వాల్సిన ఆతిధ్యానికి ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ పాక్‌లో జరిగితే భద్రతా కారణాలతో ఇండియా హాజరుకావకపోవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే ఇండియా వరకూ మ్యాచ్‌లు గతంలో ఆసియా కప్ విషయంలో చేసినట్టు న్యూట్రల్ పిచ్‌లపై జరగవచ్చు. అంటే హైబ్రిడ్ పద్ధతిలో జరిగే అవకాశాలున్నాయి. అదే సమయంలో అహ్మదాబాద్ వేదికగా ఇటీవల జరిగిన ఐసీసీ సమావేశంలో పాక్ క్రికెట్ బోర్డు ఓ విజ్ఞప్తి చేసింది. భద్రతా కారణాలతో ఇండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీకు తమ దేశానికి రాకుంటే పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. 


సరిగ్గా ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఐస్‌ల్యాండ్ క్రికెట్ బోర్డ్ టోర్నీ తమ దేశంలో నిర్వహిస్తామంటూ ముందుకొచ్చింది. తాజాగా ఐసీసీకు ఓ లేఖ రాసింది. ట్విట్టర్ ద్వారా ఐసీసీకు విజ్ఞప్తి చేసింది. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీకు ఆతిధ్యం ఇచ్చేందుకు ఐస్‌ల్యాండ్ క్రికెట్ బోర్టు ఆసక్తిగా ఉందని తెలిపింది. టోర్నీ పాకిస్తాన్‌లో జరగదన్న పుకార్ల నేపధ్యంలో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్టు లేఖలో పేర్కొంది. ఇంత అద్భుతమైన టోర్నీ నిర్వహించేందుకు ఉపయోగపడే రాతి నేల తమ దేశంలో ఉందని..అగ్నిపర్వతాల ద్వారా ఏర్పడ్డ ఓ రకమైన మట్టి వల్ల నేలపై పడిన నీరు త్వరగా ఇంకిపోతుందని ఆ లేఖలో స్పష్టం చేసింది. ఆసియా ఖండంలో కన్పించే పేలవమైన డ్రైనేజ్ వ్యవస్థ తమకు ఉండదని తెలిపింది. తాము వెనక్కి తగ్గేవాళ్లం కాదని, ఇవాళ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 202 కోసం బిడ్ వేశామని, సమాధానం కోసం ఎదురుచూస్తామని క్యాప్షన్ కూడా జత చేసింది. 


ఇప్పుడీ లేఖ చర్చనీయాంశంగా మారింది. నిజంగానే ఐస్‌ల్యాండ్ క్రికెట్ బోర్డు స్వతహాగా టోర్నీ నిర్వహించేందుకు ముందుకొచ్చిందా లేక పాక్ క్రికెట్ బోర్డును ఇరుకునపెట్టేందుకు బీసీసీఐ వ్యూహమా అనేది సందేహంగా మారింది. ఐస్‌ల్యాండ్ క్రికెట్ బోర్డ్ లేఖ వెనుక బీసీసీఐ హస్తముండవచ్చని కొందరు అనుమానిస్తున్నారు. ఏదేమైనా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ పాకిస్తాన్‌కు దక్కుతుందనేది ఆనుమానమే.


Also read: IND Vs AUS Dream11 Tips: హ్యాట్రిక్ విజయానికి టీమిండియా రెడీ.. డ్రీమ్11 టీమ్ టిప్స్, పిచ్ రిపోర్ట్, తుది జట్ల వివరాలు ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook