Ranji Trophy World Record: దేశవాళీ క్రికెట్ పండుగ రంజీలో అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆరంగేట్రం మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీతో ప్రపంచ రికార్డు సాధించాడు ఆ యువ క్రికెటర్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా జరగని దేశవాళీ క్రికెట్ పండుగ రంజీ ట్రోఫీ నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఈ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. బీహార్ రంజీ క్రికెటర్ షకీబుల్ గని ఏకంగా ప్రపంచ రికార్డు సాధించాడు. రంజీ చరిత్రలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెటర్ ఆరంగేట్రం మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 


రంజీ ట్రోఫీ 2021-22 సీజన్‌లో భాగంగా మిజోరాం వర్సెస్ బీహార్ రంజీ మ్యాచ్ ఈ రికార్డులకు వేదికగా నిలిచింది. బీహార్ తరపున ఆడుతున్న షకీబుల్ గని 387 బంతుల్లో 3 వందల పరుగులు సాధించాడు. బీహార్ తొలి ఇన్నింగ్స్‌లో షకీబుల్ గని..మొత్తం 405 బంతుల్లో 341 పరుగులు చేశాడు. ఇందులో 56 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి. అంటే కేవలం ఫోర్లతోనే డబుల్ సెంచరీ పరుగులు పూర్తయిపోయాయి. రంజీ చరిత్రలో ఇదే తొలి ట్రిపుల్ సెంచరీ. గతంలో ఈ రికార్డు మధ్యప్రదేశ్ క్రికెట్ ప్లేయర్ అజేయ్ రోహరా పేరు మీద 267 పరుగులతో ఉంది. 2018-19 రంజీ ట్రోఫీలో అజేయ్ ఈ స్కోర్ సాధించాడు. రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించిన ప్రపంచపు తొలి ఆటగాడిగా పేరు సాధించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బీహార్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 686 పరుగుల భారీ స్కోర్ సాధించింది. షకీబుల్ గనీతో (Shakibul Gani) కలిసి నాలుగవ వికెట్‌కు 5 వందల పరుగులు సాధించిన బాబుల్ కుమార్ కూడా ఈ మ్యాచ్ లో డబుల్ సెంచరీ సాధించడం విశేషం.


Also read: Virat Kohli: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆందోళనకు లోనవుతున్నాడా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook