IND vs AUS: శుభ్‌మన్ గిల్‌కు షాక్.. తెలుగు ఆటగాడికి చోటు! భారత్ తుది జట్టు ఇదే
Dinesh Karthik predicts team IND playing XI vs AUS ahead of first Test in Nagpur. టీమిండియా వెటరన్ కీపర్ దినేష్ కార్తీక్ తన తుది జట్టును వెల్లడించాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య వీసీఏలో తొలి టెస్టు ప్రారంభం కానుంది.
Dinesh Karthik Picks India Playing XI vs Australia for 1st Test in Nagpur: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 (Border Gavaskar Trophy 2023) రేపటి (ఫిబ్రవరి 9) నుంచి ఆరంభం కానుంది. భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (వీసీఏ)లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు మ్యాచ్ కోసం ఇప్పటికే నాగ్‌పూర్ పిచ్ సిద్దమయింది. పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుందనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తొలి టెస్టులో బరిలోకి దిగే భారత తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ కీపర్ దినేష్ కార్తీక్ తన తుది జట్టును వెల్లడించాడు.
తొలి టెస్టు మ్యాచ్ కోసం ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మను దినేష్ కార్తీక్ (DK) ఎంచుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill)ను డీకే పక్కన పెట్టాడు. వన్డే, టీ20లలో సెంచరీలు బాదిన గిల్‌ను కాదని సూర్యకుమార్ యాదవ్‌కు తుది జట్టులో చోటిచ్చాడు. 2022 చివర్లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో గిల్ శతకం చేశాడు. ఇటీవల ముగిసిన న్యూజీలాండ్ సిరీస్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ కూడా బాదాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
కీలక మూడో స్థానంలో టెస్ట్ స్పెసలిస్ట్ చేతేశ్వర్ పుజారాను, నాలుగో స్థానంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని దినేష్ కార్తీక్ ఎంచుకున్నాడు. 5, 6 స్థానాల్లో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్, తెలుగు ఆటగాడు కేఎస్ భరత్‌ను తీసుకున్నాడు. భరత్ వికెట్ కీపర్ అన్న విషయం తెలిసిందే. ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లను స్పిన్నర్లుగా ఎంచుకోగా.. మొహ్మద్ సిరాజ్, మొహ్మద్ షమీలను పేస్ కోటాలో ఎంచుకున్నాడు.
దినేష్ కార్తీక్ తుది జట్టు:
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మొహ్మద్ సిరాజ్, మొహ్మద్ షమీ.
Also Read: IND vs AUS: ఐసీసీ రంగంలోకి దిగి ఏదైనా చేయాలి.. నాగ్‌పూర్ పిచ్‌పై ఆస్ట్రేలియా అసంతృప్తి!
Also Read: Samantha Ruth Prabhu New Home : అన్ని కోట్లతో ఇళ్లు కొనేసిందా?.. పూర్తిగా మకాం మార్చేసిన సమంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.