Ex Australia Cricketers Jason Gillespie and Simon ODonnell Trolls Nagpur Pitch: ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 (Border Gavaskar Trophy 2023) గురువారం (ఫిబ్రవరి 9) నుంచి ఆరంభం కానుంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (వీసీఏ)లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్ కోసం నాగ్‌పూర్ పిచ్ సిద్దమయింది. పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే టెస్ట్ మ్యాచ్‌కు ఒక రోజు ముందు నాగ్‌పూర్‌లోని పిచ్ క్యూరేటర్లు వ్యవహరించిన విధానం ఆసక్తికరంగా మారింది. నీరు పట్టిన తర్వాత వికెట్ మధ్యలో మాత్రమే రోలింగ్ చేశారు.
నాగ్‌పూర్‌లోని పిచ్‌కు (Nagpur Pitch) సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పిచ్ చాలా డ్రైగా ఉందని, లెఫ్టార్మ్ స్పిన్నర్లకు బాగా సహకరించే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ఆస్ట్రేలియా లెప్ట్ హ్యాండర్లకు నాగ్‌పూర్ పిచ్ పెద్ద పరీక్షగా నిలుస్తుందని పలువురు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇలాంటి పిచ్‌ల విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) జోక్యం చేసుకోవాలని పలువురు ఆస్ట్రేలియా మాజీలు కోరారు.
సోషల్ మీడియాలో నాగ్‌పుర్ పిచ్‌పై వస్తున్న ఆరోపణలపై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ సైమన్ ఓడానెల్ స్పందిచాడు. సెన్ బ్రేక్‌ఫాస్ట్‌లో సైమన్ ఓడానెల్ మాట్లాడుతూ... 'నాగ్‌పుర్ పిచ్ విషయంలో ఏదైనా సరైనది కాదని భావిస్తే, ఐసీసీ వెంటనే జోక్యం చేసుకొని పరిశీలించాలి. ఐసీసీ రిఫరీ అన్ని చూడాలి. టెస్ట్ క్రికెట్ యొక్క సాధారణ ప్రమాణాలు మరియు ఈ మైదానం లక్షణాలకు అనుగుణంగా పిచ్ లేదని భావిస్తే ఐసీసీ రంగంలోకి దిగాలి' అన్నాడు.
భారత్‌లో పలుసార్లు పర్యటించిన మాజీ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాసన్ గిల్లెస్పీ మాట్లాడుతూ... 'నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను గెలిచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడమే భారత్ ముందున్న లక్ష్యం. అందుకే ఆస్ట్రేలియాను స్పిన్‌తో బోల్తా కొట్టించాలని భారత్ ప్రయత్నిస్తోంది' అని పేర్కొన్నాడు. అయితే భారత్‌లో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ (IND vs AUS) జరిగిన ప్రతిసారీ పిచ్‌లపై ఇలా ఆరోపణలు చేయడం సహజమేనని పలువురు అంటున్నారు.
Also Read: Nissan Magnite Price: చౌకైన, సూపర్ లుకింగ్ ఎస్‌యూవీ.. ఫీచర్లు కూడా అదుర్స్! టాటా పంచ్ కంటే తక్కువ ధర
Also Read: Turkey Earthquake: భారీ భూకంపం సమయంలో మహిళ ప్రసవం.. కుప్పకూలిన భవనాల కింద పసికందు సేఫ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.