ముంబై: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఓ మెరుపు మెరిసిన  గ్లెన్ మెక్ గ్రాత్ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. తన కెరీర్‌‌లో అద్భుతమైన పేస్​ బౌలింగ్​తో ఎంతో మంది బ్యాట్స్​మెన్‌ను గడగడలాడించిన మెక్‌గ్రాత్‌కు భారత దిగ్గజ క్రికెటర్‌‌ సచిన్‌ టెండూల్కర్‌‌ చాలా సార్లు దీటుగా సమాధానం చెప్పాడు. అయితే  సచిన్‌ కంటే వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు 'చార్ సౌ వాలా'​ బ్రియాన్‌ లారాకు బౌలింగ్​ చేసేందుకే తాను ఇబ్బంది పడ్డానని మెక్‌గ్రాత్​ అభిప్రాయపడ్డాడు.


సచిన్‌ టెండూల్కర్, బ్రియాన్ లారా ఇద్దరూ అద్భుతమైన బ్యాట్స్​మెన్లే.. అయినప్పటికీ, సచిన్‌తో పోల్చితే లారా మరింత స్వేచ్ఛగా, నిర్భయంగా బ్యాటింగ్​ చేస్తాడని తెలిపాడు. అందుకే లారాకు బౌలింగ్‌ చేయడం కష్టమని అన్నాడు. లారా ఎప్పుడూ తన శైలిని మార్చుకోలేదన్నాడు. తనతో పాటు షేన్​ వార్న్​ ఉన్నప్పుడు కూడా ఆస్ట్రేలియాలో లారా అత్యధిక పరుగులు చేశాడని చెప్పాడు. తాను లారాను 15 సార్లు ఔట్​ చేసి ఉంటానని గుర్తు చేసుకున్నాడు. కానీ, ఆసీస్​పై అతను ఎన్నో సెంచరీలు, డబుల్​ సెంచరీలు చేసి ప్రతీకారం తీర్చుకున్నాడని, అదే లారా బాటింగ్ శైలి అని కితాబిచ్చాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..