Ishan Kishan Strong Counter to Rohit Sharma after Shubman Gill hits Double Ton: ఉప్పల్ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత యువ ఓపెనర్ శుభ‌మ‌న్ గిల్ డ‌బుల్ సెంచ‌రీ చేసిన విష‌యం తెలిసిందే. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన వేళ గిల్ ఒక్కడే అసాధారణ ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. 145 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 208 రన్స్ చేశాడు. 2022లో బంగ్లాదేశ్‌పై వన్డే మ్యాచులో టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్‌ కిషన్ ద్విశతకం బాదాడు. తొలి వన్డే అనంతరం డబుల్ సెంచరీ హీరోలు గిల్, కిషన్‌‌లతో కెప్టెన్ రోహిత్ శర్మ సరదాగా మాట్లాడాడు. ఈ క్రమంలో రోహిత్‌కు ఇషాన్ కౌంటర్ ఇచ్చాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డబుల్ సెంచరీ హీరోలు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లను వన్డేలలో మూడు ద్విశతకాలు బాదిన రోహిత్ శర్మ.. బీసీసీఐ టీవీలో ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా గిల్ ఇన్నింగ్స్‌ను రోహిత్ ప్రశంసించాడు. ఇది బెస్ట్ ఇన్నింగ్స్ అని భారత కెప్టెన్ కొనియాడాడు. గిల్ అనంతరం భారత జట్టులో అత్యధిక స్కోర్ 34 పరుగులేనని, దీన్ని బట్టి గిల్ ఎంత గొప్ప ఇన్నింగ్సో ఆడాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. ఆపై గిల్‌ను 200 క్లబ్‌లోకి రోహిత్ ఆహ్వానించాడు. దీనిని తాను గొప్ప గౌరవంగా భావిస్తున్నానని గిల్  తెలిపాడు.


ప్రీ మ్యాచ్ రోటిన్‌ చెప్పమని శుభ్‌మన్‌ గిల్‌ను ఇషాన్ కిషన్ అడిగాడు. వెంటనే రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఇద్దరిది ఒకే రూమ్ కదా, ఇషాన్‌కు తెలిసి ఉంటది కదా అని అన్నాడు. తన ప్రీ మ్యాచ్ రొటీన్‌ను నాశనం చేశాడని గిల్ చెప్పాడు. కిషన్ ఎక్కువగా సినిమాలు చూస్తాడని, తనను సరిగ్గా నిద్రపోనివ్వడన్నాడు. ఆ వెంటనే ఇషాన్ కలగజేసుకొని.. తనతో రూమ్ షేర్ చేసుకుని తన పరుగులను కూడా తీసుకొని డబుల్ సెంచరీ చేశాడన్నాడు. ఈ సరదా సంబాషణతో ముగ్గురు నవ్వుకున్నారు. 



ఇక ఇషాన్ కిషన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ జోకులు పేల్చాడు. 'ఇషాన్.. నువ్ డబుల్ సెంచరీ చేసిన తర్వాత మూడు మ్యాచ్‌లు ఆడలేదు కదా?' అని ప్రశ్నించాడు. 'బ్రదర్.. నువ్వే కెప్టెన్ కదా?. ఈ విషయం నీకే బాగా తెలియాలి' అని ఇషాన్ సరదాగా అన్నాడు. దాంతో ముగ్గురు కలిసి పగలపడి నవ్వుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బాగా చెప్పావ్ ఇషాన్ అని కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read: Budh Margi 2023: మెర్క్యురీ మార్గి 2023.. ఈ 4 రాశుల వారికి ఏప్రిల్ 20 వరకు పండగే పండగ! ఆకస్మిక ధనలాభం   


Also Read: Shubman Gill Double Century: అప్పుడే డబుల్ సెంచరీ సాధించగలననే నమ్మకం కలిగింది: శుబ్‌మన్‌ గిల్‌  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.