BWF World Tour Finals: బీడబ్ల్యూఎఫ్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. ఒక్క టైటిల్ లేకపాయే!!
బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఓటమిపాలైంది. ఇండోనేసియాలోని బాలిలో జరిగిన మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో ఆన్ సియాంగ్ (దక్షిణకొరియా) చేతిలో సింధు ఓడిపోయింది.
PV Sindhu loses to An Seyoung in BWF final: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) ఓటమిపాలైంది. ఇండోనేసియాలోని బాలిలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో ప్రపంచ ఆరో ర్యాంకర్ యాన్ సియాంగ్ (దక్షిణకొరియా) చేతిలో సింధు ఓడిపోయింది. వరుస సెట్లలో 16-21, 12-21 తేడాతో ఓడిన సింధు.. రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకుంది. దాంతో ఈ ఏడాది ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా సింధు ఖాతాలో చేరలేదు.
తొలి గేమ్‌లో యాన్ సియాంగ్ (An Seyoung) ఆరంభం నుంచి దూకుడుగా ఆడగా.. పీవీ సింధు మాత్రం డిఫెన్స్ ఆటకే పరిమితం అయింది. దాంతో సియాంగ్ విరామ సమయానికి 11-6తో ఆధిక్యంలో నిలిచింది. అయితే విరామం తర్వాత సింధు పాయింట్లు సాధించినా.. ఫలితం లేకపోయింది. 16-21తో తొలి గేమ్‌ను దక్షిణకొరియా ప్లేయర్ సొంతం చేసుకుంది. రెండో గేమ్‌ను అద్భుతంగా ప్రారంభించిన సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించింది. ఆ తర్వాత సియాంగ్ కూడా వరుసగా రెండు పాయింట్లు సాధించి స్కోరు సమం చేసింది. విరామం తర్వాత కొరియా ప్లేయర్ ఆధిపత్యం చెలాయించి గేమ్‌తో పాటు మ్యాచును కైవసం చేసుకుంది.
Also Read: Sara Tendulkar: రొమాంటిక్ డేట్‌కు వెళ్లిన సారా టెండూల్కర్.. ఇంతకు ఆమె చేయి పట్టుకుంది ఎవరు?
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో (BWF Final) తుది పోరుకు చేరడం పీవీ సింధుకు ఇది మూడోసారి. 2018 సీజన్‌లో తెలుగు తేజం వరల్డ్ టూర్ టైటిల్ కైవసం చేసుకుంది. ఈ టోర్నీకి ముందు సింధు.. ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్‌లో సెమీస్ వరకు మాత్రమే చేరుకుంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు చేరినా టైటిల్ మాత్రం దక్కలేదు. ఈ ఏడాది సింధుకు ఏమాత్రం కలిసిరాలేదనే చెప్పాలి. కరోనా కారణంగా చాలా టోర్నీలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. చివరగా టోక్యో ఒలింపిక్స్ 2020లో సింధు ((PV Sindhu) ) కాంస్య పతకాన్ని సాధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook