Pat Cummins: ఆస్ట్రేలియా కెప్టెన్‌గా పాట్ కమిన్స్.. రెండో ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు! వైస్ కెప్టెన్ ఎవరంటే?
మహిళకు అసభ్య సందేశాలు పంపిన ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి టీమ్ పైన్ ఇటీవల స్వచ్ఛందంగా తప్పుకున్న విషయం తెలిసిందే.. అయితే జరగనున్న యాషెస్ 2021 సీరీస్ కు బౌలర్ పాట్ కమిన్స్‌ను కెప్టెన్ గా ఎంపిక చేసారు..
CA appoints Pat Cummins as Australia's new Test captain: కొన్నాళ్ల కిందట ఓ మహిళకు అసభ్య సందేశాలు (సెక్స్ చాటింగ్) పంపినట్టు నిరూపితమవడంతో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి టీమ్ పైన్ (Paine) ఇటీవల స్వచ్ఛందంగా తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2021కు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) కు భారీ షాక్ తగిలింది.
అయితే యాషెస్ సిరీస్‌కు రెండు వారాల కంటే తక్కువ సమయం ఉండటంతో.. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్‌గా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్‌ను (Pat Cummins) నియమించింది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. ఆసీస్ వైస్ కెప్టెన్‌గా మాజీ సారథి స్టీవ్ స్మిత్ (Steve Smith) ఎంపికయ్యాడు.
ఆస్ట్రేలియా (Australia) టెస్ట్ జట్టుకు పాట్ కమ్మిన్స్ 47వ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 1950లో టెస్టు జట్టుకు నాయకత్వం వహించిన రే లిండ్‌వాల్ తర్వాత ఆసీస్ జట్టు పగ్గాలు అందుకున్న రెండవ ఫాస్ట్ బౌలర్‌గా కమిన్స్ రికార్డుల్లో నిలిచాడు. 2018 దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ 12 నెలల నిషేధం ఎదుర్కొన్నాడు.
దాంతో టీమ్ పైన్ (Tim Paine) ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. నిషేధం అనంతరం స్మిత్ జట్టులోకి వచ్చినా.. సీఏ (CA) మాత్రం పైన్‌నే కొనసాగించింది. ఇప్పుడు సెక్స్ చాటింగ్ వివాదం కారణంగా పైన్ తప్పుకోవడంతో కమిన్స్ సారథిగా నియమితుడయ్యాడు.
Also Read: AP Rains: ఏపీకి మరోసారి వర్ష సూచన- పలు చోట్ల భారీ వానలకు అవకాశం!
'పాట్ కమ్మిన్స్ అత్యుత్తమ ఆటగాడు మరియు నాయకుడు. మైదానంలో మరియు వెలుపల అతని వైఖరి బాగుంటుంది. సహచరుల, ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో గౌరవాన్ని పొందాడు. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టుకు అతడు సరైన కెప్టెన్. కమ్మిన్స్ మంచి విజయాలు అందింస్తాడు' అని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ నిక్ హాక్లీ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 8 నుంచి యాషెస్ సిరీస్ 2021 ఆరంభం కానుంది. 5 మ్యాచుల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. జనవరి 14, 2022న ఆరంభం అయ్యే చివరి టెస్టుతో ఈ సిరీస్ ముగియనుంది.
28 ఏళ్ల పాట్ కమిన్స్ క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన ఓ ప్రకటనలో మాట్లాడుతూ... 'ప్రతిష్టాత్మక యాషెస్ 2021 (Ashesh 2021) ముందు ఆస్ట్రేలియా కెప్టెన్‌గా (Australia's new Test captain) నియమించడం నాకు గౌరవంగా ఉంది. గత కొన్నేళ్లుగా టిమ్ పైన్ జట్టుకు అందించిన విజయాలను నేను కొనసాగించగలనని ఆశిస్తున్నాను. నేను కెప్టెన్, స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్‌లుగా ఆసీస్ జట్టుతో కలిసి పనిచేస్తాం. జట్టులో సీనియర్ ఆటగాళ్లు, యువ ప్రతిభావంతులు ఉన్నారు. మొత్తంగా ఆస్ట్రేలియా జట్టు బలంగా ఉంది' అని అన్నాడు. ఆస్ట్రేలియా తరఫున కమిన్స్ 34 టెస్టులు, 69 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. గతకొంత కాలంగా కమిన్స్ నిలకడగా రాణించడమే అతడికి కెప్టెన్సీ దక్కింది.
Also Read: Akhanda Pre Release: ఒకే వేదికపై బాలయ్య, అల్లు అర్జున్- ఫ్యాన్స్‌కు ఇక పండగే!
'నేను ఆస్ట్రేలియా జట్టు నాయకత్వానికి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. నా అనుభవాన్ని పాట్ కమిన్స్‌కు అందిస్తా. మైదానంలో సలహాలు, సూచనలు ఇస్తా. పాట్, నేను చాలాకాలం పాటు కలిసి ఆడాం. మేము గొప్ప స్నేహితులం. ఒక జట్టుగా మేము మంచి, సానుకూల క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాము. ఆస్ట్రేలియా జట్టు పటిష్టంగా ఉంది. యాషెస్ 2021 గెలుస్తామనే నమ్మకం ఉంది. అందుకు 100 శాతం కష్టపడుతాం' అని స్టీవ్ స్మిత్ ఒక ప్రకటనలో తెలిపాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి