India Vs West Indies T20 Match Highlights: ప్రస్తుతం భారత్‌, వెస్టిండీస్‌ మద్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా చోటు చేసుకున్న ఒక సంఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ మధ్య కొన్ని సంఘటనలు మ్యాచ్‌ గురించి తెగ చర్చ జరిగేలా చేస్తున్నాయి. తాజాగా కూడా చహల్‌ బ్యాటింగ్‌ కు వచ్చిన సందర్భంగా జరిగిన సంఘటన నవ్వులు పూయించింది అనడంలో సందేహం లేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బౌలర్ అయిన యుజేంద్ర చహల్ బ్యాటింగ్ కు వెళ్లడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. తాజా మ్యాచ్ లో వరుసగా వికెట్లు పోవడంతో చహల్‌ బ్యాటింగ్‌ కు వెళ్లాల్సి వచ్చింది. మొదట బ్యాటింగ్‌ కు వెళ్లిన చాహల్‌ కి ఏమైందో ఏమో కానీ పెవిలియన్ కు వచ్చాడు. బ్యాటింగ్‌ ప్రారంభించకుండానే పెవిలియన్ కు పరుగులు పెట్టిన చహల్‌ అక్కడ ఉన్న బ్యాటర్ చెప్పడంతో మళ్లీ వికెట్ల వద్దకు వెళ్లాడు. 


ఈ సరదా సంఘటనతో వెస్టిండీస్ బ్యాట్స్ మన్‌ లు కూడా ఏం జరిగింది అంటూ చహల్‌ ను సరదాగా ప్రశ్నించడం చూడవచ్చు. మొత్తానికి ఈ వ్యవహారం అంతా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 


ఉమ్రాన్ మాలిక్‌ అక్కడ ఏదో చెప్పడంతో చహల్‌ తిరిగి డగౌట్ వైపు వెళ్లడం మాత్రమే కాకుండా బౌడరీ కూడా దాటేశాడు. అయితే అపైర్లు మైదానంలోకి రమ్మంటూ మళ్లీ పిలవడంతో వెళ్లాడు. బ్యాటింగ్ ఆర్డర్‌ విషయంలో మేనేజ్మెంట్‌ సరిగా నిర్ణయం తీసుకోక పోవడం వల్ల ఇలా జరిగి ఉంటుందని కొందరు అంటున్నారు. 


Also Read: Mexico Bus Accident: మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం.. 18 మంది దుర్మరణం  


టీ20 మ్యాచ్ కనుక చహల్‌ బ్యాటింగ్‌ చేసే అవసరం రాదని బ్యాటింగ్ ఆర్డర్ చెప్పి ఉండక పోవచ్చు. అందుకే చహల్‌ కానస్త కన్ఫ్యూజ్‌ అయ్యి ఉంటాడు అంటూ మాజీ క్రికెటర్ లు అంటున్నారు. చూడ్డానికి సరదాగా అనిపించినా కూడా జెంటిల్‌మెన్ గేమ్‌ లో ఇలా జరగడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 



బ్యాటింగ్ ఆర్డర్ విషయం లో మళ్లీ ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్‌ ది అంటూ క్రికెట్‌ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ సరదా సంఘటన ప్రస్తుతం సదరు మ్యాచ్‌ గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. ఈ మ్యాచ్‌ లో ఒక బంతిని ఆడిన చాహల్‌ ఒక పరుగు చేసి నాటౌట్ గా నిలిచాడు.


Also Read: International Beer Day 2023: ఈ రోజే 'అంతర్జాతీయ బీర్ డే '..బీర్‌ ఒంటికి మంచిదేనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి