లడాఖ్‌లోని గాల్వన్ లోయలో అమరులైన 20 మంది జవాన్ల సేవల్ని దేశమంతా స్మరించుకుంటుంది. ఈ నేపథ్యంలో రాజకీయాలను టచ్ చేస్తూ, అమరుల త్యాగాలకు విలువివ్వకుండా చేసిన్ ట్వీట్ దుమారం రేపింది. చివరికి ఉద్యోగాన్ని కోల్పోయేలా చేసింది. అమరులైన జవాన్ల శవపేటికలకు పీఎం కేర్స్ అనే స్టిక్కర్లు అతికించి తీసుకొస్తారా అంటూ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీకి చెందిన డాక్టర్ తొట్టపిల్లిల్ మధు ట్వీట్ చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"186686","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]] 


దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవల్ని గుర్తించకుండా, రాజకీయాలకు తావిచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేలా ట్వీట్ చేయడం పెను దుమారం రేపింది. కాస్త తెలుసుకోవాలి ఉందంటూ అలాంటి ట్వీట్ చేయడంతో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇది గుర్తించిన చెన్నై ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ మధుపై వేటు వేసింది.



‘తొట్టపిల్లిల్ మధు చేసిన ట్వీట్‌ అతడి వ్యక్తిగత నిర్ణయం. ఆ ట్వీట్‌తో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి ఏ సంబంధం లేదు. టీమ్ డాక్టర్ బాధ్యతల నుంచి ఆయనను సస్పెండ్ చేశాం. ఫ్రాంచైజీకి చెందిన వ్యక్తి ఇలాంటి ట్వీట్ చేయడంపై చింతిస్తున్నామంటూ’ సీఎస్‌కే తమ అధికారిక ఖాతా నుంచి ట్వీట్ చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ