రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్-11 నేడు జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్-11 టైటిల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు బరిలో దిగుతున్నాయి. క్వాలిఫయర్-2లో రషీద్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో మంచి జోష్‌లో సన్‌రైజర్స్ ఉండగా.. ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ చాలా కూల్‌గా ఉంది. ఐపిఎల్‌ టోర్నీ జరిగిన ఈ పదేళ్లలో చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు 2010, 2011లలో విజేతగా.. 2008, 2012, 2013, 2015లలో రన్నరప్‌గా నిలిచింది. సన్‌రైజర్స్‌ జట్టు ఒక్కసారి 2016లో మాత్రమే విజేతగా నిలిచింది.  కాగా ఫైనల్లో గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్‌కిది మూడో టైటిల్ కాగా, హైదరాబాద్‌కు రెండో టైటిల్ అవుతుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు సమిష్టిగా ఈ టోర్నీలో రాణిస్తోంది. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌‌లలో ఆ జట్టు అత్యద్భుతంగా రాణిస్తోంది. ఇక సన్‌రైజర్స్‌ జట్టు విషయానికొస్తే, చెన్నైతో క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో చేసిన తప్పులను మళ్ళీ పునరావృతం చేయకుండా ఆదివారం జరిగే ఫైనల్లో జాగ్రత్తగా ఆడితే టైటిల్‌ను మరోసారి కైవసం చేసుకోవడం ఖాయం.


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు: శిఖర్‌ థావన్‌, వృద్ధిమాన్‌ సాహా, విలియమ్సన్‌(సారథి), షకీబ్‌-అల్‌-హసన్‌, యూసుఫ్‌ పఠాన్‌, బ్రాత్‌వైట్‌, రషీద్‌ఖాన్‌, భువనేశ్వర్‌, సిద్ధార్ట్‌ కౌల్‌, మనీష్‌ పాండే, ఖలీల్‌ అహ్మద్‌/దీపక్‌ హుడా.


చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు: షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌, సురేష్‌ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోని, బ్రేవో, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, లుంగీ ఎన్గిడి, బిల్లింగ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కరణ్‌ శర్మ/ హర్భజన్‌సింగ్‌.


ప్రైజ్‌మనీ వివరాలు...


విజేత : రూ. 20 కోట్లు


రన్నరప్‌ : రూ. 12.5 కోట్లు


3వ స్థానం : రూ. 8.75 కోట్లు


4వ స్థానం : రూ. 8.75 కోట్లు


ఆరెంజ్‌ క్యాప్‌ : రూ. 10 లక్షలు


పర్పుల్‌ క్యాప్‌ : రూ. 10 లక్షలు