Chris Gayle 1000 Sixes in T20 | టీ20 ఫార్మెట్ లో 1000 సిక్సులు కొట్టిన తొలి క్రికెట్ ఆటగాడిగా క్రిస్ గేల్ ( Chris Gayle ) అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచంలో టీ20 ఫార్మెట్ లో ఏ ఆటగాడు కూడా ఈ కీర్తిని సాధించలేకపోయాడు. ఈ ఫీట్ చేయలేపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 13లో ( IPL 2020 ) గేల్ ఈ అద్భుతం చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Watch: Video: బౌలర్ గా ధోనీ తిసిన ఒకే ఒక వికెట్ ఎవరిదో తెలుసా ? 


కరేబియన్ వీరుడు క్రిస్ గేస్ ఐపీఎల్ 2020లో ( IPL 2020) కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడుతున్న విషయం తెలిసింది. గురువారం పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచు సిందర్భంగా గేల్ మరోసారి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 63 బంతుల్లోనే 8 సిక్సులు బాది 99 పరుగులు చేశాడు. దాంతో పాటు టీ 20లో వెయ్యి సిక్సులు కొట్టిన ఏకవీరుడిగా నిలిచాడు గేల్.


గేల్ 99 పరుగులు వల్ల పంజాబ్ టీమ్ 4 వికెట్లు  కోల్పోయి 184 పరుగులు చేయగలిగింది. 41 సంవత్సరాల గేల్ ఐపీఎల్ లీగ్ లో ఇప్పటి వరకు 349 సిక్సులు బాదాడు. మొత్తం మీద టీ20 పొట్టి ఫార్మెట్ లో గేల్ ను మించిన సిక్సులు వీరుడు దూర దూరం వరకు లేడు. ఈ లిస్టు చూస్తే విషయం మీకే అర్థం అవుతుంది.



ALSO READ | Doppelgänger: మనుషులను పోలిన మనుషులు అంటాం కదా.. వీళ్లే వాళ్లు.. 


టీ 20లో ఎక్కువ సిక్సులు కొట్టిన వీరులు వీరే


Players Who Smashed Most Sixes in T20


1. క్రిస్ గేల్ -10001


2. పోలార్డ్ -690


3. మెకల్లమ్-485


4. వాట్సన్-467


5. రస్సెల్-447


ఐపీఎల్ 13 సీజన్ ప్రారంభంలో 1000 సిక్సులు పూర్తి అవ్వడానికి గేల్ మరో 22 సిక్సులు కొట్టాల్సి ఉండగా 7 మ్యాచుల్లోనే గేల్ ఈ రికార్డు పూర్తి చేశాడు.


Also Read | Ravan On Ambulance: రావణుడు యాంబులెన్స్ ఎక్కాడు..పాపం పుష్పక విమానం ఏమైందో ఏమో! 


This News Is Updating.. Please Refresh The Page



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR